లూజ్ మోషన్స్ తో ఇబ్బందా? ఇవిగోండి చిట్కాలు

ఇంఫెక్షన్స్ వలనో, తిన్న ఆహారం వలనో మోషన్స్ మొదలవడం చూస్టుంటాం.ఇది ఒక టెంపరరీ సమస్యే అయినా, ఉన్న కొద్దిరోజులు నరకం స్పెలింగ్ రాయిస్తుంది.

ఉన్నచోట ఉండనివ్వదు, ఓ పట్టాన సుఖంగా కూర్చోనివ్వదు.ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు.

మేం చెప్పే చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.* లూజ్ మోషన్స్ కి అతి సులువుగా, అతి చవకగా దొరికే మందు అరటిపండు.

దీనిలో ఉండే పెక్టిన్ అనే పదార్థం, రిచ్ పొటాషియం కంటెంట్, మోషన్స్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.లూజ్ మోషన్స్ తో ఇబ్బందిపడుతున్నప్పుడు రెండు మూడు గంటలకోసారి ఒక్క అరటిపండైనా తింటూ ఉండండి.

Advertisement
Foods To Be Taken To Cut Loose Motion Down Details, Loose Motions, Motions, Food

* యోగ్ రట్ కూడా లూజ్ మోషన్స్ పై బాగా పనిచేస్తుంది.దీనిలో ఉండే హెల్తీ బ్యాక్టీరియా జీర్ణక్రియను ట్రాక్ లో పెట్టి మోషన్స్ ని ఆపేస్తుంది.

అందుకే మోషన్స్ వచ్చిన రోజు 2-3 కప్పుల యోగ్ రట్ తినండి.* ఆపిల్ సైడెడ్ వెనిగర్ లాభాల గురించి కొత్తగా చెప్పేదేముంది.

ఇది మోషన్స్ ని కలిగించే బ్యాక్టీరియాని చంపుతుంది.అరటిపండు లాగే దీంట్లో కూడా పెక్టిన్ కంటెంట్ ఎక్కువ.

గ్లాసులో గోరువెచ్చని నీళ్ళు తీసుకోని ఓ రెండు టీస్పూనుల ఆపిల్ వెనిగర్ ని కలిపి తాగుతూ ఉండండి.ఫలితం మీ కళ్ళ ముందు ఉంటుంది.

Foods To Be Taken To Cut Loose Motion Down Details, Loose Motions, Motions, Food
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
మనం రోజు చూసే ఈ సినిమాలకు డబ్బింగ్ చెపుతున్న హీరో హీరోయిన్స్

* అల్లం కూడా మోషన్స్ పై బాగా పనిచేస్తుంది.వేడి నీటిని గ్లాసులో తీసుకోని అందులో చెంచాడు అల్లం వేసుకోని రోజుకి ఓ మూడుసార్లు తాగండి.మోషన్స్ దెబ్బకి పారిపోవాల్సిందే.

Advertisement

* పసుపుతో కాని పని ఉంటుందా! చెంచాడుకి కొంచెం తక్కువ పసుపుని గోరువెచ్చని నీటిలో కలుపుకోని రోజుకి మూడుసార్లు తాగండి.లూజ్ మోషన్స్ నుంచి ఉపశమనాన్ని పొందడం ఖాయం.

* దానిమ్మపండులో యాంటిఫంగల్, యాంటివైరల్, యాంటిబ్యాక్టిరియల్ లక్షణాలు బాగా ఉంటాయి.మోషన్స్ వచ్చినప్పుడు, రోజుకి రెండుమూడు గ్లాసుల దానిమ్మరసం తప్పకుండా తాగండి.

తాజా వార్తలు