Obscenity : అశ్లీలత పై సమరశంఖం పూరించాలి

కరోనా అన్ని అనర్థాలకు మూలంగా మారింది, గత సంవత్సరం మార్చి నెల నుండి ఆన్లైన్ క్లాసుల ప్రాపకం ఎక్కువగా ఉంది, మధ్యతరగతి, ఉన్నత తరగతి, పట్టణాలల్లో ఉండే విద్యార్థులకు ఎక్కువగా ఆన్లైన్ బోధన జరుగుతున్నది.

కేవలం 27 శాతం విద్యార్థులు ఆన్లైన్ తరగతులు హాజరవుతున్నారు.అందులో 20 శాతం విద్యార్థులు శ్రద్ధ వహిస్తున్నారు.దాదాపు 80 శాతం పిల్లలు ట్యాబు ఓపెన్ చేసి వేరే పనులల్లో నిమగ్నమవుతున్నారు.

పిల్లలు ఎక్కువగా అశ్లీల చిత్రాలను చూస్తున్నట్లు ఈ మధ్య కోయంబత్తూరు చెందిన స్వచ్చంద సంస్థ సర్వేలో తేలింది.ఎక్కువ మంది పిల్లల్లో అహింస, రౌద్రం, సెక్స్ విషయాల పట్ల మక్కువ చూపుతున్నారు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఫోర్న్ సైట్ల సంఖ్య కూడ విపరీతంగా పెరిగిపోయింది.

వీటిని బ్లాక్ చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.ప్రతి రోజు కొన్ని వందల సంఖ్యలలో లైంగిక వేధింపులు, మానభంగాలు, హత్యలు, అక్రమ సంబంధాలు, ఫేస్బుక్ వాట్సాప్, ప్రచార మాధ్యమాల ద్వారా పరిచయం అంతలోనే అమ్మాయిలను నిర్ములించడం వంటి సంఘటనలు లేని రోజంటూ ఉండదు.

సుప్రీం కోర్టు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన ఫలితం సూన్యం .వ్యక్తిగత సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా బహిరంగపరుస్తున్న, అశ్లీల దృశ్యాలు, సమాచారాన్ని ఉంచుతున్న వెబ్‌సైట్‌లను నిలిపివేసినట్లు ప్రభుత్వం వెల్లడించిన ప్రభుత్వం మరో వైపు పెగాసస్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడం చేస్తున్నది, ఇమెయిల్స్ హ్యాక్ చేస్తున్నది.ఛైల్డ్ ఫోర్నోగ్రఫిక్ వెబ్ సైట్లు భారత్ వెలుపలివేనని గత సంవత్సరం కేంద్రం పేర్కొని 3000 పైగా అస్లీల వెబ్సైటు లను తొలగించింది.

Fill In The Blank On Obscenity , Child Pornography, Porn Movies, Information Tec

ప్రతి రోజు కొన్ని వందల సైట్లు వెలుగులోకి వస్తున్నాయి.సభ్యత గల సమాజంలో జీవించే హక్కు ప్రతి ఒక్కరిదీ.అసభ్యత అనేది వివిధ రకాల చట్టాలలో నేరం.

సెక్షన్ 292 మరియు సెక్షన్ 294 లోని భారతీయ శిక్షాస్మృతి అశ్లీల పుస్తకాలు ప్రచురించటం, అసభ్యకరమైన పాటలు పాడటం మరియు బహిరంగ ప్రదేశంలో లేదా సమీపంలో అసభ్యకరమైన పనులు చేయడం నేరంగా పరిగణించబడుతుంది.లైంగిక అసభ్యకరమైన చర్యల ఆన్‌లైన్ ప్రసారం లేదా ప్రచురణను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం శిక్షించింది.

పోస్ట్ ఆఫీస్ చట్టం పోస్ట్ ద్వారా అసభ్యకరమైన పదార్థాలు ప్రసారం చేయడాన్ని నిషేధించింది.ఇతర చట్టాలు కూడా ఉన్నాయి, కానీ విస్తృత విషయం ఏమిటంటే అశ్లీలత చట్టం విస్తృతమైన రోజువారీ కార్యకలాపాలను కవర్ చేస్తుంది.

Fill In The Blank On Obscenity , Child Pornography, Porn Movies, Information Tec

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 బహిరంగ ప్రదేశంలో అసభ్యకరమైన చర్యలు లేదా పదాలను శిక్షిస్తుంది.నేరంగా పరిగణించాలంటే, అశ్లీలత "ఇతరులకు చిరాకు" కలిగిస్తుంది.ఈ చట్టం ప్రకారం దోషిగా తేలిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష పడుతుంది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

సెక్షన్ 292 ప్రకారం అసభ్య పుస్తకాలు నేరపూరితమైనవి.ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా రావడంతో అశ్లీలత చట్టం అభివృద్ధి చెందింది.

సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం, ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకరమైన విషయాలను ప్రచురించిన లేదా ప్రసారం చేసే ఎవరైనా శిక్షించబడవచ్చు.ఇప్పుడు ప్రసార మాద్యమాలల్లో వెకిలితనం, ద్వందార్థాలు, పంచ్ డైలాగులు, ప్రాసలకోసం వాడే పదాలు, మహిళలను కించపరచేవిగా ఉంటున్నాయి.

అన్ని నాటికలలోను, సీరీయల్స్ లో ఆడవారిని విలన్లుగా చూపించడం సర్వసాధారణమైనది.సమకాలీన సమాజ ప్రమాణాలను వర్తింపజేస్తూ, సగటు వ్యక్తి వలె అశ్లీలతను అంచనా వేయాలి.

సమకాలీన సమాజ ప్రమాణాల పరీక్ష సమాజంలో మారుతున్న విలువలను పరిగణనలోకి తీసుకుంటుంది.ఒక శతాబ్దం లేదా దశాబ్దం క్రితం కూడా అసభ్యకరంగా ఉండేది, ఇప్పుడు అసభ్యకరంగా ఉండాల్సిన అవసరం లేదు.

తల్లితండ్రులు పిల్లలను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి, పిల్లల అలవాట్లు, ఆసక్తి పట్ల శ్రద్ధవహించాలి.మంచి మానవసంబంధాలు, మంచి అలవాట్లు ప్రోది చేసేది గా ఇంటి వాతావరణం ఉండాలి.

పిల్లలకు మంచి చెడు విచక్షణ, లక్ష్య సాధన, సానుకూల దృక్పథం, శారీరిక శ్రమ, మంచి ఆహార, ఆరోగ్య అలవాట్ల కు ఇల్లే కేంద్రం కావాలి.ప్రభుత్వం తక్షణమే అశ్లీల సినిమాలు, జిగుప్సాకరమైన పోస్టర్లు, అశ్లీల సాహిత్యం పై తక్షణమే ఉక్కుపాదం మోపి వాటిని నిరోధించాలి.

తాజా వార్తలు