మాజీమంత్రి, విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.గతంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోను ఆయన మంత్రిగా కొనసాగారు.
ఇక 2014 లో టిడిపిలో చేరిన గంటా అప్పుడూ మంత్రి గానే కొనసాగారు.చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగాను మారారు.
అయితే 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నించినా.ఆ పార్టీ కీలక నేతలు కొంతమంది అడ్డుకోవడంతో గంటా చేరిక వాయిదా పడింది ఇక అప్పటి నుంచి టిడిపి లో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నా.ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయకుండా సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో గంటా పార్టీ మారుతారని , రాబోయే ఎన్నికల్లో ఆయన టిడిపి నుంచి పోటీ చేసే అవకాశం లేదని అంతా భావిస్తూ వచ్చారు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే నిన్న టిడిపి కీలక నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు.ఎప్పటి నుంచో అయ్యన్నపాత్రుడు తో వ్యక్తిగత విభేదాలు ఉన్నా.
అవన్నీ పక్కనపెట్టి గంటా ఆయనకు అనుకూలంగా ట్విట్ చేశారు.సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్టును ఖండిస్తున్నాను, కనీస ప్రోటోకాల్స్ లేకుండా అరెస్టు చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను భే షరతుగా అయ్యన్నను విడుదల చేయాలి అంటూ గంటా ట్వీట్ చేసారు.
ఈ ట్వీట్ తో అటు అయ్యన్న వర్గం, ఇటు గంటా వర్గం షాక్ కి గురైంది.టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు గంటా, అయ్యన్న మధ్య రాజీ ప్రయత్నం చేసినా వీరు ఏకమయ్యేందుకు ఆసక్తి చూపించలేదు.ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకునేవారు.అయితే ఇప్పుడు మాత్రం అయ్యన్న విషయంలో గంటా స్పందించిన తీరు చూస్తుంటే.ఇటీవల కాలంలో చంద్రబాబు అయ్యన్నకు ఎక్కువగా ప్రాధాన్య ఇస్తుండడం, తనను పక్కన పెడుతూ ఉండడంతో గంటా తన మనసు మార్చుకున్నారని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత దృష్ట్యా టిడిపిలోనే కొనసాగితే మంచిదనే అభిప్రాయంతో ఆయన ఉండడం 2024 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశం తదితర కారణాలతో , సీనియర్ నేత అయ్యన్న విషయంలో గంటా సానుకూలంగా స్పందించి తనుకు టిడిపిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ,రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాననే సంకేతాలను పంపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
.