అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )హీరోయిన్ గా నటించగా యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ( Sreeleela )బాలకృష్ణ కూతురి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ దసరా పండుగకు కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.తాజాగా కూడా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ సినిమాలో మొత్తం ఐదు ఫైట్లు ఉన్నాయట.
ఫైట్లన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని సమాచారం.ఈ మూవీలో ఫస్టాఫ్ లో రెండు ఫైట్లు, సెకండాఫ్ లో మూడు ఫైట్లు ఉన్నాయట.
ఈ ఐదు ఫైట్లు కూడా అదిరిపోయాయని, అంతేకాకుండా ఈ ఐదు ఫైట్లు సినిమాకు బాగా హైలైట్ గా ఉండబోతున్నాయని అభిమానులకు పునకాలు తెప్పించబోతున్నాయని తెలుస్తోంది.
జైలు ఫైట్ తో బాలయ్య బాబు( Balayya Babu ) ఇంట్రడక్షన్ ఉంటుందట.ఈ ఇంట్రో ఫైట్ కి థియేటర్లలో విజిల్స్ మోత మోగడం ఖాయమని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ అయితే సినిమాకే హైలైట్ గా నిలవనుందట.
బాలయ్య ఉగ్ర రూపానికి థమన్ బ్యాక్ స్కోర్ తోడై ఆ ఫైట్ సీన్ ఒక రేంజ్ లో వచ్చిందని చెబుతున్నారు.సెకండాఫ్ లో వచ్చే ఫారెస్ట్ ఫైట్ కూడా జైలు ఫైట్ కి ఏ మాత్రం తగ్గకుండా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందట.
ఇక క్లైమాక్స్ ఫైట్ లో కూడా బాలయ్య విశ్వరూపం చూపిస్తాడట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy