కృష్ణంరాజు.. కమల్ హాసన్ మధ్య.. డ్యాన్స్ పంచాయతీ గురించి మీకు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు కృష్ణంరాజు .

రాజుల కుటుంబానికి చెందిన ఈ హీరో అంతే గొప్ప మనసుతో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకున్నాడు అని చెప్పాలి.

అయితే ఇటీవలే అనారోగ్య సమస్యల కారణంగా కృష్ణంరాజు కన్ను మూసారు.దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆయన కెరియర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఒకానొక సినిమా సమయంలో కృష్ణంరాజు, లోకనాయకుడు కమల్ హాసన్ మధ్య డాన్స్ లకు సంబంధించిన పంచాయితీ కూడా జరిగింది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.ఇంతకీ ఏం జరిగిందంటే.

ఇప్పుడంటే ఎంతో మంది హీరోలు మెలికలు తిరిగిన డ్యాన్సులు చేస్తున్నారు.కానీ ఒకప్పుడు మాత్రం హీరోలు డాన్స్ చేయడానికి ఎంతో కష్టపడేవారు.ఇక వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగానే డాన్స్ మాస్టర్ లు కూడా డాన్స్ కంపోజ్ చేస్తూ ఉండేవారు.1973లో హేమాంబరదరరావు దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా జమున హీరోయిన్ గా ఇంటి దొంగలు అనే సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా ఊటి లో షూటింగ్ జరుగుతున్న సమయంలో కృష్ణంరాజుకి కమల్ హాసన్ కి మధ్య ఒక చర్చ నడిచిందట.

Fight Between Krishnam Raju And Kamal Haasan , Krishnam Raju,kamal Haasan ,fight
Advertisement
Fight Between Krishnam Raju And Kamal Haasan , Krishnam Raju,kamal Haasan ,fight

ఊటీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో జనాలు మొత్తం షూటింగ్ చూసేందుకు గుమిగూడారు.అలాంటి సమయంలో తంగప్ప అనే డాన్స్ మాస్టర్ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు.అతని అసిస్టెంట్ హీరో కృష్ణంరాజు కు స్టెప్స్ చూపిస్తూ ఉన్నాడట.

అతను చూపిస్తున్న స్టెప్పులు మాత్రం కృష్ణంరాజుకు రావడం లేదు.ఇక చుట్టూ ఉన్న జనం ముందు పరువు పోయేలా ఉంది అని అనుకున్నాడట.

దీంతో ఆ కుర్రాడి ని పక్కకు తీసుకెళ్లి నువ్వు డాన్స్ మాస్టర్ నేనేమో నీలాగా డాన్స్ చేయలేను.అందుకే నేను నేర్చుకునే విధంగా డాన్స్ కంపోజ్ చేయాలి అని చెప్పడంతో.

కాసేపు తల గోక్కొని సదరు కుర్రాడు ఓకే అలాగే అంటూ చెప్పి ఇక డాన్స్ కంటిన్యూ చేశాడట.ఆ కుర్రాడు ఎవరో కాదు కమల్ హాసన్.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఈ విషయాన్ని కృష్ణంరాజు, కమలహాసన్ కూడా పలుమార్లు గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు