ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న ట్రక్కును వ్యాన్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.అదేవిధంగా మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.గంజాంలోని దిగపహండి నుంచి తారుణి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా ప్రమాద సమయంలో వ్యాన్ లో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?
Advertisement

తాజా వార్తలు