తెలంగాణ మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు..!

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది.

ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు చెందిన ఏజెన్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానెట్స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే గతేడాది శ్వేతా ఏజెన్సీలో సోదాలు సైతం నిర్వహించింది.

చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ తేల్చింది.ఈ నేపథ్యంలోనే రూ.4.8 కోట్ల అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన ఈడీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను రూ.50 కోట్ల వరకు పెండింగ్ ఉన్నట్లు నిర్ధారించారని తెలుస్తోంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు