తెలంగాణలో జరిగే ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్.. !

తాజాగా గులాభి వనాన్ని వీడి కమల దళంలోకి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుగా అధికార పార్టీ పై ఊహించని విధంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అదిసరే తెలంగాణ రాజకీయాల్లో తెరవెనక జరిగిన భాగోతాన్ని పక్కన పెడితే రాజకీయ కుతంత్రాలకు ఈటల బలైనారనే సానుభూతి మాత్రం తెలంగాణ ప్రజల్లో ఉందని భావిస్తున్నారట ఈటల అనుచర గణం.

ఇకపోతే ఈటల బీజేపీలోకి చేరడం పట్ల గర్విస్తున్నానని చెబుతూనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండానే రెపరెపలాడుతుందని, కారు టైరు పంక్చర్ చేసి దొరల అహంకారానికి అంతం పాడవలసిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడించారు.

Minister Etela Rajender Comments About Huzurabad Elections, Telanagana, BJP, Min

కాగా త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిరూపం వంటిదని, అవినీతి పాలనకు ఘోరీ కట్టే సమయం ఇదేనంటూ ఈటల మేడ్చల్ జిల్లా షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు