ఎన్నో వ్యాధులను నయం చేసే మునగాకు గురించి తెలిస్తే రోజు తప్పక తింటారు

సాధారణంగా మున‌గ‌కాయ‌ల‌ను అందరు చారు, కూరగా చేసుకొని తింటూ ఉంటారు.మున‌గ‌కాయ‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికి తెలుసు.

అయితే మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.వాటి గురించి తెలిస్తే ప్రతి రోజు మునగాకును తింటారు.

మునగాకును పప్పుగా చేసుకోవచ్చు.అలాగే పొడిగా చేసుకొని తినవచ్చు.

మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి.మునగాకులో కాల్షియం పాలలో కన్నా 17 రేట్లు అధికంగా ఉంటుంది.

Advertisement

మునగాకును ప్రతి రోజు తింటే ఎముకలు, దంతాలు బలంగా, దృడంగా, ఆరోగ్యంగా ఉంటాయి.అందువల్ల పెరిగే పిల్లలకు మునగాకు చాలా మంచిది.

ముంగాకులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.అందువల్ల నాన్ వెజ్ తినని వారికీ అవసరమైన ప్రోటీన్ ని మునగాకు అందిస్తుంది.

దాంతో శరీరానికి పోషణ బాగా అందుతుంది.మునగాకులో పొటాషియం అరటిపండులో కంటే 15 రేట్లు అధికంగా ఉంటుంది.

దీనితో రక్తసరఫరా మెరుగుపడి రక్తపోటు తగ్గుతుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
ఆవ నూనెలో ఈ ఆకును మరిగించి తలకు రాస్తే హెయిర్ ఫాల్ కు గుడ్ బై చెప్పవచ్చు

ప్రతి రోజు 7 గ్రాముల మునగాకు పొడిని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గుతాయి.మునగాకులో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.అందువల్ల మధుమేహం ఉన్నవారికి మునగాకు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

Advertisement

మునగాకులో అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన కంటికి సంబందించిన దృష్టి మాంద్యం, రేచీకటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

తాజా వార్తలు