Radisson Drugs Case : డ్రగ్స్ పార్టీ కేసు..: మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Case ) కేసులో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఈ మేరకు మీర్జా వాహిద్ బేగ్ ను విచారించిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పొందుపరిచారని తెలుస్తోంది.

నిందితులు స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కాగా ఈ నెల 29న గచ్చిబౌలిలో మీర్జా వహీద్( Mirza Wahid ) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయన నుంచి సుమారు 3.58 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ( Abbas Ali ) ద్వారా వివేకానందకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారని సమాచారం.

ఫిబ్రవరి నెలలోనే పది సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు మీర్జా వహీద్ రిమాండ్ రిపోర్టులో మరోసారి సినీ దర్శకుడు క్రిష్( Director Krish ) పేరును ప్రస్తావించారు.కేసులో ఏ13 అబ్దుల్ రెహమాన్ తో ఏడాదిగా మీర్జా వాహిద్ కు పరిచయం ఉందని తెలుస్తోంది.

Advertisement

రాడిసన్ హోటల్ లో పదికి పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు