సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) ఒకరు అని చెప్పాలి.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.
అదేవిధంగా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.
ఈయన ఉపాసన ( Upasana ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇక వీరిద్దరూ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.ప్రతి విషయంలోనూ ఒకరినొకరు గౌరవించుకుంటూ భాద్యతలను పంచుకుంటూ ఎంతో ఆదర్శంగా నిలిచారు.ఇకపోతే తాజాగా ఉపాసన రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా ఈ దంపతులు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ( Ananth Ambani ) ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జామ్ నగర్( Jam Nagar ) కి ప్రత్యేక విమానంలో వెళ్లారు.

విమానంలో ఉపాసన కాస్త రిలాక్స్ అవుతూ కనిపించారు.ఉపాసన సీట్లో కాస్త రిలాక్స్ అవుతూ ఉండగా రాంచరణ్ తన కాళ్ళను నొక్కుతూ కనిపించారు.దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ అని ఈయన ఎంత స్టార్ అయినా ఏ మాత్రం ఇగో లేదు అంటూ కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం ఈయన ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్యకు భర్తే కదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
మరి కొందరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఈ క్యూట్ వీడియోని వైరల్ చేస్తున్నారు.







