Radisson Drugs Case : డ్రగ్స్ పార్టీ కేసు..: మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Case ) కేసులో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ మేరకు మీర్జా వాహిద్ బేగ్ ను విచారించిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పొందుపరిచారని తెలుస్తోంది.

 Drug Party Case Key Points In Mirza Wahid Beghs Remand Report-TeluguStop.com

నిందితులు స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కాగా ఈ నెల 29న గచ్చిబౌలిలో మీర్జా వహీద్( Mirza Wahid ) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయన నుంచి సుమారు 3.58 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ( Abbas Ali ) ద్వారా వివేకానందకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారని సమాచారం.ఫిబ్రవరి నెలలోనే పది సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు మీర్జా వహీద్ రిమాండ్ రిపోర్టులో మరోసారి సినీ దర్శకుడు క్రిష్( Director Krish ) పేరును ప్రస్తావించారు.

కేసులో ఏ13 అబ్దుల్ రెహమాన్ తో ఏడాదిగా మీర్జా వాహిద్ కు పరిచయం ఉందని తెలుస్తోంది.రాడిసన్ హోటల్ లో పదికి పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube