రైల్వే భోగీల వెన‌కాల X అనే ప‌దం ఎందుకు ఉంటుందో తెలుసా..?

సాధారణంగా అందరూ ట్రైన్ లో ప్రయాణిస్తూనే ఉంటారు.ఆ ప్రయాణంలో ట్రైన్ చివరి భోగి వెనకాల పెద్దగా ఎక్స్ అనే సింబల్ రాసి ఉంటుంది.

దీన్ని ప్రయాణికులు అందరు గమనిస్తూ ఉంటారు కానీ చాలామందికి ఇలా ఎందుకు రాసి ఉంటుందొ అన్న విషయం మాత్రం తెలియదు.ఇప్పుడు మనం అలా రాసి ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.

ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే అక్షరం తప్పనిసరిగా ఉండాలి.ఎందుకంటే మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా కారణం చేత భోగిలు విడిపోయి నట్లయితే స్టేషన్ లో ఉన్న అధికారులు గుర్తించడానికి ట్రైన్ చివరిన ఎక్స అనే అక్షరం మెన్షన్ చేస్తారు.

స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరుతున్నప్పుడు రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న వ్యక్తి చివరి భోగి మీద ఎక్స్ అనే ఉందో లేదో గమనిస్తాడు.ఒకవేళ ఎక్స్ అనే అక్షరం లేనట్లయితే ఆ వ్యక్తి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇస్తాడు.

Advertisement
Do You Know Why There X Behind Railway Bogies-రైల్వే భోగీ�

రైల్వే అధికారులు త్వరగా స్పందించి ప్రమాదవశాత్తు విడిపోయినట్లు గమనించి వెంటనే ఆ మార్గంలో వెళ్లే రైళ్లను ఆపివేసి ఎక్కడ భోగిలు విడిపోయాయో తెలుసుకుంటారు.

Do You Know Why There X Behind Railway Bogies

ఇక ట్రైన్ మీద ఎక్స్ అనే అక్షరం పగటి పూట మాత్రమే కనిపిస్తుంది.ఇక రాత్రి సమయంలో ట్రైన్ అన్ని బోగీలతో వెళుతుంది అని గుర్తు ఉండడానికి ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే గుర్తును ఒక చిన్న రెడ్ లైట్ లా మెన్షన్ చేస్తారు.ఇక రెడ్ లైట్ ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి వెలుగుతూ ఆగుతుంది.

చివరి పెట్టె మీద వెలుగుతున్న రెడ్ లైట్ ని బట్టి ట్రైన్ అన్ని పెట్టెలతో కలిసి వెళుతుంది అని కన్ఫామ్ చేసుకుంటారు. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?
Advertisement
" autoplay>

తాజా వార్తలు