Ram Charan Chiranjeevi : రామ్ చరణ్ కి చిరంజీవి సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?

చిరంజీవి( Chiranjeevi ) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram Charan ) పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన చిరుత సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తన స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులకు చూపించాడు.ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో రాజమౌళి డైరెక్షన లో మగధీర సినిమాలో( Magadheera ) నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

 Do You Know Which Of Chiranjeevi Movies Ram Charan Likes The Most-TeluguStop.com

మగధీర సినిమాతో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తను వేణు తిరిగి చూడకుండా వరుస సినిమాలు చేస్తు సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తన మార్కును కూడా క్రియేట్ చేసుకున్నాడు.ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న సినిమాలు చూసుకుంటూ పెరిగాడట.అయితే ఆయనకి వాళ్ళ నాన్న సినిమాల్లో ఏ సినిమా అంటే ఎక్కువగా ఇష్టం అని అడగగా, ఆయన దానికి సమాధానంగా ఒక్క సినిమా అని చెప్పడం కష్టం గానీ బాగా నచ్చిన కొన్ని సినిమాల పేర్లు అయితే చెబుతాను అంటూ గ్యాంగ్ లీడర్,( Gang Leader ) జగదేకవీరుడు అతిలోకసుందరి,( Jagadeka Veerudu Atiloka Sundari ) యముడికి మొగుడు, ఖైదీ, ఠాగూర్ లాంటి సినిమాల పేర్లు చెప్పాడు.

 Do You Know Which Of Chiranjeevi Movies Ram Charan Likes The Most-Ram Charan Ch-TeluguStop.com

నిజానికి చిరంజీవి సినిమాలన్నీ కూడా అందరికీ విపరీతంగా నచ్చుతాయి.ఎందుకంటే చిరంజీవి సినిమాలు ఫ్లాప్ అయిన కూడా అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఆయన నటన చూస్తూ కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేశారు.ఇక చిరంజీవి క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.

ఆయన సినిమాలు నచ్చని ప్రేక్షకుడు ఉండడు ఆయన డాన్స్ ని ఎంజాయ్ చేయని అభిమాని లేడనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube