మన ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం నుంచి పెద్ద కార్యం నిర్వహించేటప్పుడు ఆ శుభకార్యంలో తప్పకుండా అక్షింతలు కనిపిస్తాయి.పుట్టినరోజు, వివాహం వంటి రోజులలో కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు.
అదేవిధంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పంతులు భక్తుడి తలపై అక్షింతలు వేస్తాడు.ఈ విధంగా అక్షింతలు తయారు చేసేటప్పుడు బియ్యంలో కేవలం పసుపు లేదా కుంకుమ మాత్రమే కలిపి అక్షింతలు తయారు చేస్తారు.
కొన్నిసార్లు కొందరికీ ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి.శుభకార్యాలలో అక్షింతలే ఎందుకు వాడాలి? వాటిలో పసుపు మాత్రమే ఎందుకు కలపాలి అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతాయి.అయితే అక్షింతలు కోసం బియ్యం, పసుపు, కుంకుమ ఎందుకు వాడుతారో ఇక్కడ తెలుసుకుందాం.
నవగ్రహాలలో తొమ్మిది గ్రహాలకు తొమ్మిది రకాల ధాన్యాలను సమర్పిస్తారు.
ఒక్కో గ్రహానికి ఒక్కో దాన్యం ప్రతిరూపం.ఈ క్రమంలోనే బియ్యం చంద్రుడికి ప్రతీతి.
మనసుకి కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యంపై ఉంటుంది.మానవుని శరీరం ఓ విద్యుత్ వలయం చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలో ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహం బియ్యం ద్వారా ఆశీర్వదించే వారిలోకి ప్రవేశిస్తుంది.
ఇకపోతే ఆశీర్వదించే వారి చేతికి ఏవైనా చర్మవ్యాధులు ఉంటే ఆ వ్యాధులు కూడా ఆశీర్వాదం తీసుకునే వారి పై ప్రభావం చూపిస్తాయి.
ఈ విధంగా చర్మ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండటం కోసం అక్షింతలలో పసుపు కలుపుతారు.పసుపు చర్మ వ్యాధులను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.కనుక ఎక్కువగా అక్షింతలు తయారు చేయడం కోసం పసుపును, కొన్ని సమయాలలో కుంకుమను ఉపయోగిస్తారు.
ఈ విధంగా పసుపు కలపటం వల్ల ఇతరుల నుంచి కేవలం మనకు విద్యుత్ ప్రవాహం మాత్రమే జరుగుతుంది.అయితే అక్షింతలలో పసుపు కానీ, కుంకుమ గాని కలపని వాటిని శుభకార్యాలలో ఉపయోగించరు.
LATEST NEWS - TELUGU