కేసీఆర్ కు ఒకేసారి రెండు స్ట్రోక్ లా..? అది కూడా కుటుంబం నుంచే...!!

రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వ‌తం కాదు.ఇప్పుడున్న ప‌రిస్థితులు రేపు ఉండ‌క‌పోవ‌చ్చు.

 Two Strokes For Kcr At The Same Time That Too From The Family Details, Cm Kcr, M-TeluguStop.com

గ‌తంలో ఉన్న అనుకూలాలు ఇప్పుడు ఉండ‌క‌పోవ‌చ్చు.పైగా రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఒక‌రిదే పైచేయి ఉండ‌దు.

ఎన్నో ఒడుదుడుకులు త‌ప్ప‌వు.అయితే ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న కేసీఆర్ కూడా ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఒర్చుకుని ఓ స్థాయికి ఎదిగారు.

ప్ర‌త్యేక తెంలంగాణ ఉద్య‌మం మొద‌ట్లో కేసీఆర్ ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాడు.ఎన్నో దెబ్బ‌లు తిన్నాడు.

కానీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో కేసీఆర్ ఎదురులేని నేత‌గా ఎదిగారు… రాష్ట్ర అవ‌త‌ర‌ణ త‌ర్వాత రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.ఒక దశలో ఆయన్ను ఉద్దేశించి చిన్నపాటి విమర్శ చేయటానికి కూడా తెలంగాణలో ఏ పార్టీ నేతలైనా వెన‌క్కి త‌గ్గేవారు.

కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.చిన్న లీడ‌ర్ కూడా ప్ర‌శ్నిస్తున్నాడు.వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు.

కూతురి రూపంలో.

ఇప్పటివరకు తెలంగాణలో కేసీఆర్ దే పెద్ద గొంతు అనుకునే స్థాయి నుంచి.ఆయనకు మించినోళ్లు చాలామందే ఉన్నారన్న విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా తమను తాము ప్రదర్శించుకుంటున్నారు.

ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ మీద వస్తున్న విమర్శలను చూసినోళ్లు ఎవరైనా.ఎలాంటి కేసీఆర్.ఎలాంటి మాటలు పడాల్సి వస్తోంది.? అన్న భావన క‌లుగుతోంది.ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు తెర మీదకు రావటం తెలిసిందే.ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేయటం.

దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.పరువు నష్టం దావాలను వేశారు కవిత.అయితే సీఎం కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ తగిలినట్లేనన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు మ‌రో స్ట్రోక్…!

Telugu Cm Kcr, Delhi, Kalvakuntla, Liquor Scam, Ktr, Mlc Kavitha, Estate, Telang

ఇక మ‌రో ట్విస్ట్ ఏంటంటే… వరుస పెట్టి వాసవి.ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా సాగుతున్న ఐటీ దాడులు కూడా టార్గెట్ చేసి చేస్తున్నవే అనే మాట వినిపిస్తోంది.ఈ రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కు లింకులు ఉన్నాయన్న దానిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్య‌వ‌హారంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.ఫినిక్స్ కంపెనీ యజమాని చుక్కపల్లి సురేశ్ కల్వకుంట్ల కుటుంబానికి బినామీ అన్నారు.

రాజకీయ ప్రముఖులు.ఉన్నతాధికారులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ చుక్కపల్లి అక్కడున్న సిమెంట్ కంపెనీలకు ఫోన్ చేసి మరీ.టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని బెదిరించినట్లుగా ఆరోపించారు.చుక్కపల్లి సురేష్ కు.కల్వకుంట్ల కుటుంబానికి మధ్యనున్న సంబంధాలపై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ బాంబు పేల్చారు.

ఇదిలా ఉంటే.అక్రమ మద్యం వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.తెలంగాణ నేతలే ఢిల్లీ లిక్కర్ స్కాంకు ఆద్యులని ఆరోపించారు.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.

తెలంగాణలోనే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని.ఇదంతా చూస్తే తెలంగాణ మద్యం అమ్మకాల్లో ఎంతో స్కాం జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దీంతో సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ ఎదురుకాని కొత్త అనుభవం ఎదురైందన్న మాట వినిపిస్తోంది.అయితే ఆరోప‌ణ‌ల్లో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలిసే వ‌ర‌కు వేచి చూడాల్సిందే…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube