ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారమని, కాలం ఎట్లయితదోనని పంచాంగ శ్రవణం వినేవారమని, కానీ సీఎం కేసీఆర్ దయతో కాలమైనా కాకున్నా రెండు పంటలు పండిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు స్పష్టం చేశారు.సిద్ధిపేట జిల్లా దుబ్బాక కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హాజరయ్యారు.
ఈ మేరకు దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గా భాస్కర్ చారి, తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇప్ప లక్ష్మి మంత్రి హరీశ్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
-రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్,దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ, తొగుట, దౌల్తాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ శుభాకాంక్షలు.కాలమైనా కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో రెండు పంటలు పండిస్తున్నారని, తాగు, సాగునీరు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం, దుబ్బాక నియోజకవర్గం గోస తీర్చింది సీఎం కేసీఆర్ సార్.
జై జవాన్-జై కిసాన్ అనే నానుడి లేకుండా.ఓ వైపు రైతులకు గోస పెట్టి, మరోవైపు సైనికులకు కూడా అగ్నిపథ్ తో దేశ యువతను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మంత్రి మండిపడ్డారు.విద్యుత్ మీటర్ల నిబంధన లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి యేటా 6 వేల కోట్లు, రెండేళ్లలో 12 వేల కోట్లు ఎందుకు నిలిపివేశారో కేంద్ర బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్.
– చట్టంలో విద్యుత్ మీటర్లు లేకపోతే రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 12వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్ర బీజేపీని మంత్రి డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందించినట్లు, ఇందు కోసం 57 వేల 8 వందల 80 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడి మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల కింద రైతుభీమా సాయం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, ఇప్పటికే 87 వేల మంది రైతుల కుటుంబాలకు రూ.4333 కోట్ల రూపాయలు రైతుభీమా సాయాన్ని అందించినట్లు మంత్రి హరీశ్ వెల్లడి.తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.
ఇతర ఏ రాష్ట్రాలలోనైనా ఉన్నాయా.అని బీజేపీ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను మంత్రి సూటిగా ప్రశ్నించారు.
రైతుబంధు, అమృత్ సరోవర్, హర్ ఘర్ కో జల్, మూగజీవాలకు అంబులెన్స్ 1962లను దేశమంతా అమలు చేస్తూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర బీజేపీ కాపీ కొట్టిందని, ఇందుకు తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తి దాయకంగా నిలిచిందని సగర్వంగా మంత్రి వెల్లడి.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు లేదు.కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు అవుతున్నదని ఇది సీఎం కేసీఆర్ ఘనతగా మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం బీజేపీ హయాంలో 400 సిలిండర్ 1200 చేసిందని మంత్రి హరీశ్ రావు ఎద్దేవాచేశారు.దుబ్బాక నియోజకవర్గంలో 54 వేల మందికి నెల నెలా ఆసరా పింఛన్లు అందిస్తున్నాం.
మరో 15 రోజులలో ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేయగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్-భారతీయ రాష్ట్ర సమితిగా మారనున్నది.కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కోతలు, వాతలు తప్ప ఇచ్చిందేమీ లేదు.
ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్:దేశం కష్టాలలో ఉన్నదని, దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ పౌరుడిగా నా బాధ్యత నెరవేర్చాలని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారు.సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో నిధుల కొరత లేకుండా దుబ్బాక నియోజకవర్గం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందుతున్నది.
దుబ్బాకను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆశీస్సులతో అన్నీ రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళతాం.కార్యక్రమంలో మంత్రి వెంట ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.