ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం ( Vyooham ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముంటాయి.
ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా వేస్తూ వచ్చారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.
కథ:
రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వీర శంకర్ రెడ్డి( Veera Shankar Reddy ) మరణించడంతో ఆయన మరణం నుంచి ఈ సినిమా మొదలవుతుంది.వీర శంకర్ రెడ్డి మరణించడంతో ఆయన కుమారుడు మదన్ ( అజ్మల్ అమీర్) ఒక్కసారిగా షాక్ అవుతారు.
తన తండ్రి మరణ వార్త విని అనేక మంది మరణించారు అనే విషయం తెలుసుకొని వారందరినీ ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర చేపడతారు.ఈ యాత్రకు హై కమాండ్ ఒప్పుకోకపోవడమే కాకుండా దీనికి తోడు ప్రతిపక్ష నేత ఇంద్ర బాబు ( ధనుంజయ్ ప్రభునే) భారత్ పార్టీతో కలిసి అక్రమంగా కేసులు పెట్టారు.
ఇలా జైలుకు వెళ్లినటువంటి జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో శ్రవణ్ కళ్యాణ్ తో కలిసి ఇంద్ర బాబు గెలుస్తారు.ఆ తర్వాత శ్రవణ్ ఇంద్ర బాబుకు మధ్య విభేదాలు రావడంతో దూరం పెరుగుతుంది.వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి మదన్ ప్రజలలోకి వెళ్లి ఏం చేశారు ఆయన ఎలా ముఖ్యమంత్రి ఎలా అయ్యారనే విషయాల గురించి ఈ సినిమాని చూపించారు.
నటీనటుల నటన:
మదన్మోహన్ రెడ్డి పాత్రలో నటించిన అజ్మల్ అమీర్( Ajmal Amir ) పూర్తిగా తన పాత్రకి న్యాయం చేశారని చెప్పాలి.అచ్చం వైయస్ జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వాజ్ మాట తీరు దించేశారు.తన భార్య మాలతి పాత్రలో మానస కూడా ఎంతో అద్భుతంగా నటించారు.ఇంద్రబాబు పాత్రలో ధనంజయ్ ఎంతో అద్భుతమైనటువంటి నటన కనపరిచారు.ఇలా ప్రతి ఒక్కరు వారి పాత్రలకు 100% న్యాయం చేశారని చెప్పాలి.

టెక్నికల్: టెక్నికల్ పరంగా రాంగోపాల్ వర్మ మార్క్ కొన్ని సన్నివేశాలలో స్పష్టంగా కనిపించింది.సినిమాకు తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ సెట్ అయింది.మధ్య మధ్యలో రాంగోపాల్ వర్మ వాయిస్ హైలెట్ అయింది.కెమెరా విజువల్స్ కూడా అద్భుతంగా అనిపించాయి.

విశ్లేషణ: ఈ శ్రమ ప్రారంభంలోనే పాత్రలను పరిచయం చేయడానికి అంటే ముందుగా రాంగోపాల్ వర్మ ఈ సినిమాలో పాత్రలు ఎవరిని ఉద్దేశించింది కాదు అని చెబుతారు.కానీ ఈ సినిమా ప్రకటించినప్పుడు ఈ సినిమా వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy )కథ ఆధారంగా రాబోతుంది అనేది అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఆయన చేసిన పాదయాత్ర ఆయన ముఖ్యమంత్రి కావడం వంటి సన్నివేశాలను ఉద్దేశించి చేస్తున్నది కనుక కథ మొత్తం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలిసిపోతుంది కానీ దానిని చూపించిన తీరు అద్భుతంగా ఉంది.ఇక ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చకపోవచ్చు కానీ వైయస్ అభిమానులకు మాత్రం రాంగోపాల్ వర్మ అద్భుతమైన ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా కథ అందరికీ అవగాహన ఉండటం.
బాటమ్ లైన్:
ఫైనల్ గా ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే అయినప్పటికీ వయస అభిమానులకు మాత్రం ఫుల్ కిక్కిచ్చే సినిమా.
రేటింగ్:
3/5