మనలో చాలామంది పల్లెటూరి నుంచి వచ్చి కెరీర్ లో సక్సెస్ సాధించిన వాళ్లే ఉంటారు.అయితే సక్సెస్ సాధించే విషయంలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
అయితే కష్టపడిన వాళ్లకు ఏదో ఒకరోజు ప్రతిభకు తగ్గ ఉద్యోగం లభించడంతో పాటు ప్రశంసలు కూడా దక్కుతాయి.డాక్టర్ గోపీ ఐఏఎస్( IAS Gopi ) సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేము.
తమిళనాడు రాష్ట్రంలోని తిరువాలూర్ జిల్లాలోని పొద్దాటూర్ పేటాయి గ్రామంలో గోపీ జన్మించారు.
పశువుల పాలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే గోపీ కుటుంబం జీవనం సాగించేవారు.
మద్రాస్ కు( Madras ) వెళ్లి పీజీ పూర్తి చేసిన గోపీ తమిళనాడు రాష్ట్రంలో 6 సంవత్సరాల పాటు వెటర్నరీ సర్జన్ గా పని చేశారు.ఆ సమయంలోనే గోపీకి పెళ్లి కాగా ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
వెటర్నరీ సర్జన్ గా( Veterinary Surgeon ) గోపీ పని చేస్తున్న సమయంలో కొంతమంది స్నేహితులు ఐఏఎస్ అయితే ఎక్కువమందికి సేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు.

స్నేహితుల ప్రోత్సాహంతో గోపీ కోచింగ్ సెంటర్ కు వెళ్లకుండానే అవసరమైన మెటీరియల్ ను సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు.రెండుసార్లు సివిల్స్( Civils ) రాసిన ఫెయిల్యూర్ కాగా మూడో ప్రయత్నంలో మాత్రం మంచి ర్యాంక్ సాధించడంతో ఉద్యోగం వచ్చింది.సబ్ కలెక్టర్ గా ఏడాది పని చేసిన గోపీ 2020 సంవత్సరంలో నిజాంపేట్ కార్పొరేషన్ కమిషనర్ గా జాబ్ లో చేరారు.

గోపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులలో క్రియేటివిటీ ఎక్కువని పేర్కొన్నారు.సిటీ వాళ్లతో పోల్చి చూస్తే గెలవాలనే తపన పల్లెటూరి వాళ్లలోనే ఎక్కువని గోపీ పేర్కొన్నారు.పల్లెటూళ్ల వాళ్లమనే భావనను దూరం చేసుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ కావడం సులువేనని గోపీ చెప్పుకొచ్చారు.గోపీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
