మహా శివుడి పది అవతారాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే మహావిష్ణువు( Maha Vishnu ) దశావతారాల గురించి దాదాపు చాలా మందికి తెలుసు.దుష్ట సంహారం చేసేందుకు విష్ణువు కొన్ని అవతారాలు ఎత్తాడు.

అయితే విష్ణువు మాత్రమే కాదు భోళా శంకరుడైన శివుడు( Maha Shiva ) కూడా 10 అవతారాలు ఎత్తాడని పండితులు చెబుతున్నారు.భోళా అవతారంలో శివుడితో పాటు పార్వతి దేవి( Parvati Devi ) కూడా ఆయనకి భార్యగా అవతారాలు ఎత్తుతూ వచ్చింది.

ఇంతకీ పరమేశ్వరుడు ఎత్తిన పది అవతారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శివుడి పది అవతారాలలో మొదటిది మహాకాలుడు.

మహాకాళిగా పార్వతి దేవి మహా కాలుడి భార్యగా వచ్చింది.వీరిని పూజించిన భక్తులకి భక్తి, ముక్తి ఇచ్చి భక్తుల కోరికలను నెరవేర్చారు.

Advertisement
Do You Know The Lord Shiva Dashavataras Details, Lord Shiva, Lord Shiva Dashava

ఈశ్వరుని రెండో అవతారం తారక అవతారం.( Taraka Avatar ) తారక దేవి భార్యగా స్వామి స్వామి వారిని అనుసరించింది.

అలాగే పరమేశ్వరుడి మూడవ అవతారం బాల భువనేశ్వరుడు.( Bala Bhuvaneshwarudu ) ఈ అవతారంలో శివుని సతీమణి పార్వతి దేవి బాల భువనేశ్వరి రూపంలో ఆయనకి భార్యగా వచ్చింది.

ఈ అవతారంలో సత్పురుషులకి సుఖాలను ప్రసాదించారు.

Do You Know The Lord Shiva Dashavataras Details, Lord Shiva, Lord Shiva Dashava

మహా శివుడు ముక్కంటి షోడశశ్రీవిద్యేశుడు పేరుతో నాలుగో అవతారం ఎత్తాడు.ఈ అవతారంలో షోడశశ్రీవిద్యా దేవిగా పార్వతి దేవి ఆయనకి అర్ధాంగిగా వచ్చింది.నీలకంఠుడి ఐదవ అవతారం భైరవుడు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

( Bhairavudu ) పార్వతి దేవి భైరవిగా శివుడితో కలిసి వచ్చింది.శివుడి ఆరవ అవతారం భిన్నమస్త అవతారం.

Advertisement

భిన్న మస్తగా పార్వతీదేవి అవతారం ఎత్తి మహా శివుడిని వివాహం చేసుకుంది.ధూమవంతుడిగా( Dhumavanthudu ) శివుడు ఏడవ అవతారం ఎత్తాడు.

పార్వతి దేవి ధమావతిగా ఆయన అర్ధాంగిగా వచ్చింది.భక్తులకి కొంగుబంగారంగా ఈ ఆది దంపతులు నిలిచారు.

కైలాస ఆదిపతి ఎనిమిదవ అవతారం బగళాముఖుడు.శివుడి అర్ధాంగిగా ఈ అవతారంలో పార్వతి దేవి బగళాముఖిగా అవతరించింది.అలాగే మాతంగుడిగా శివుడు తొమ్మిదవ అవతారం ఎత్తాడు.

మాతంగిగా పార్వతి దేవి అవతరించింది.శివుడు దశావతారం కమలుడు.

కమలగా పార్వతి దేవి జన్మించింది.మహాశివుని ఈ 10 అవతారాలు తంత్ర శాస్త్రంలో ఎక్కువగా కనిపిస్తాయి.

తాజా వార్తలు