సీతారామం సినిమాకు పెట్టింది ఎంత... రాబట్టింది ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఐదు దశాబ్దాల నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నిర్మాణ సంస్థలలో వైజయంతి బ్యానర్ ఒకటి.

వైజయంతి బ్యానర్ ద్వారా అశ్వినీ దత్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలుకొని నేడు సీతారామం సినిమా వరకు ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

తాజాగా విడుదలైన సీతారామం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకులు ముందుకు వచ్చి ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదినీ ఆకట్టుకుందని చెప్పాలి.

ఇలా ప్రేక్షకుల మదిని దోచిన ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం హిందీ భాషలలో కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా పలు భాషలలో విడుదలైన ఈ సినిమా కేవలం థియేటర్లో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

Do You Know How Much Sitaram Put Into The Movie, Sitaram ,ashwini Dutt ,ntr , Vy

ఇలా థియేటర్ లోనూ డిజిటల్ మీడియాలోనూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా కోసం మేకర్స్ ఎంత ఖర్చు చేశారు.ఈ సినిమా ఎంత లాభాలను తెచ్చి పెట్టింది అనే విషయానికి వస్తే.

Advertisement
Do You Know How Much Sitaram Put Into The Movie, Sitaram ,Ashwini Dutt ,Ntr , Vy

ఈ సినిమా కోసం 51 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా ఈ సినిమా పెట్టుబడిని రాబట్టడమే కాకుండా మరో 20 కోట్లు లాభాలను తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది.ఏదిఏమైనా అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు