తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉన్న ఆస్తిపాస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక రెండు దఫాలు బీఆర్ఎస్ (BRS) పార్టీ అధికారంలో ఉంది.

ఇక మొదటిసారి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ( Congress ) అధికారంలోకి వచ్చింది.

ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి 64 స్థానాలను గెలుపొందింది.ఇక నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లో సీఎం ఎవరు అని ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది.

అయితే చాలామందికి రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అని అనుకున్నప్పటికీ బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాత్రం మేం కూడా సీఎం స్థానానికి ఏమాత్రం తక్కువ కాము అన్నట్లుగా ప్రవర్తించి చివరికి ఢిల్లీకి కూడా వెళ్లి ఢిల్లీ పెద్దల బుజ్జగింపుల మేరకు పదవి పై ఆశలు వదులుకొని రేవంత్ రెడ్డిని సీఎంగా ఓకే చేశారు.అయితే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యాక ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

Do You Know How Many Crores Of Properties The New Chief Minister Of Telangana Re

ఇప్పటికే ఆయన రాజకీయ ప్రస్థానం, భార్య, పిల్లలు,కుటుంబం ఇలా ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే తాజాగా తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) ఆస్తిపాస్తులు ఎన్ని కోట్లో తెలుసా అంటూ నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ రేవంత్ రెడ్డి ఆస్తులు( Revanth Reddy Assets ) ఎన్ని కోట్లో ఇప్పుడు తెలుసుకుందామా.

Advertisement
Do You Know How Many Crores Of Properties The New Chief Minister Of Telangana Re

రేవంత్ రెడ్డికి స్థిరా చరాస్తులు పూర్తిగా కలుపుకొని దాదాపు 30 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది.ఈయన తన నామినేషన్ వేసిన సమయంలో అఫీడవిట్లో ఉన్న ఆస్తిపాస్తులు వివరాల ప్రకారం.రేవంత్ రెడ్డి ఆయన భార్య గీతారెడ్డి( Geetha Reddy ) దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు చూసుకుంటే.30,95,52,652 అని తెలుస్తోంది.

Do You Know How Many Crores Of Properties The New Chief Minister Of Telangana Re

రేవంత్ రెడ్డి దగ్గర ఐదు లక్షల 34 వేల నగదు తో పాటు ఆయన భార్య గీతారెడ్డి దగ్గర 1235 గ్రాముల బంగారం విలువ 83,36,000 ఉన్నాయట.అలాగే 7,17,800 విలువచేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయట.అలాగే వెండి ఆభరణాలు, వస్తువులు కలిపి 9,700 గ్రాముల వరకు ఉన్నట్టు సమాచారం.

రేవంత్ రెడ్డి ఆయన భార్య దగ్గర పేరు మీద ఉన్న అప్పు 1,30,19,901 ఉందని తెలుస్తోంది.అలాగే రేవంత్ రెడ్డి దగ్గర ఒక మెర్సిడెజ్ బెంజ్ కార్, హోండా సిటీ ఉన్నాయి.

ఇక రేవంత్ రెడ్డి దగ్గర 50,000 ఖరీదు చేసే రైఫిల్.రెండు లక్షల ఖరీదు చేసే పిస్టల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
మన సీనియర్ హీరోలు చేస్తున్న సినిమాలతో భారీగానే ప్లాన్ చేస్తున్నారా..?

ఇక ఈ సమాచారం మొత్తం రేవంత్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు