హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.ఈ మేరకు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో టీడీపీ నేత లోకేశ్ తో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.భేటీ నేపథ్యంలో హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి పవన్, నాదెండ్ల వెళ్లారని తెలుస్తోంది.
ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలోని పరిస్థితులపై చర్చిస్తున్నారని సమాచారం.అలాగే ఉమ్మడి కార్యాచరణ మేరకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.