శ్రీదేవితో ఫోటో దిగిన ఈ ముగ్గురు పిల్లలు హీరోయిన్స్ అయ్యారు.

చూసే ప్రతి ఫోటో వెనుక ఓ కథ ఉంటుంది.ఒక నేపధ్యం ఉంటుంది.

కొందరి జీవితాలు ఉంటాయి.అలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆమె రేంజ్ అందరికీ తెలిసిందే.అప్పట్లో ఆమెని బయట జనాలు మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని వాళ్ళు కూడా దేవతలా ఆరాధించేవారు.

అందుకు హీరోయిన్ నగ్మా తండ్రి చందర్ కూడా అతీతం ఏమి కాదు.ఆయన ఓసారి సెట్ కి తన ముగ్గురు కూతుర్లను తీసుకుని వెళ్లారు.

Advertisement

శ్రీదేవితో ఫోటో కావాలని పిల్లలు మారం చేశారు.శ్రీదేవి కూడా ఆ పిల్లలను చూసి, ముచ్చట పడి వారితో ఫోటో దిగింది.

ఇప్పుడు ఆ పిల్లలు శ్రీదేవితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కారణం శ్రీదేవి కాదు.

ఆ ముగ్గురు పిల్లలే.ఎందుకు అంటే ఆ ,ముగ్గురు పిల్లలు తరువాత కాలంలో స్టార్ హీరోయిన్స్ అయ్యారు.

వారిలో పెద్ద అమ్మాయి నగ్మా.ఓ దశాబ్దం పాటు వెండితెరపై నగ్మా హవా కొనసాగింది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు అంతా నగ్మా డేట్స్ కోసం ఎదురుచూసిన వారే.తరువాత కాలంలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ గంగూలీతో కూడా నగ్మా ప్రేమ వ్యవహారం నడించింది.

Advertisement

అవన్నీ అయ్యాక నగ్మా రాజకీయాల్లో బిజీ అయ్యింది.ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో తనకి రాజ్యసభ సీటు రాలేదని అలిగింది కూడా.

ఇలా నగ్మా ప్రయాణంలో చాలానే మలుపులు ఉన్నాయి.ఇక రెండో అమ్మాయి రాధిక.

ఈమె కూడా మొదట హీరోయిన్ గా మారింది.ఈమె స్క్రీన్ పేరు రోషిణి.

మొదట్లో తను కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో చేసింది.తరువాత ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది.

ఇప్పుడు ఆమె జీవితమేమిటో ఆమెదే.తెర మీదకు మళ్లీ రాలేదు.

ప్రస్తుతం వంద శాతం ఓ మామూలు గృహిణిగా లైఫ్ లీడ్ చేస్తోంది.

చివరి అమ్మాయి జ్యోతిక.ఈమె తెలివిగా తన కెరీర్, తన జీవితాన్ని ప్లాన్ చేసుకుంది.ఈమె హీరో సూర్యను పెళ్లి చేసుకుంది.

పెళ్లి అయిన తరువాత కూడా నటిగా కొనసాగుతోంది.డబ్బు, కీర్తి, కెరీర్, పిల్లలు.

ఇలా అన్నీ సదుపాయాలతో సరైన ప్లానింగుతో ముందుకి పోతోంది జ్యోతిక.నటిగా మాత్రమే కాదు, జోతిక నిర్మాతగా కూడా మారి కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తుంది, నిర్మిస్తుంది.

అన్నింటా తోడుగా నిలిచే భర్త దొరకడం ఈమె అదృష్టం.ఇలా.శ్రీదేవితో ఆనాడు అమాయకంగా ఫోటో దిగిన ఈ ముగ్గురు.హీరోయిన్స్ గా ఒక వెలిగి, మళ్ళీ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు.

మరి.ఈ ముగ్గురు అక్కచెల్లలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

తాజా వార్తలు