40లోనూ య‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకుంటే ఇలా చేయండి!

వ‌య‌సు పెరిగినా అందంగా, య‌వ్వ‌నంగా క‌నిపించాల‌న్న కోరిక అంద‌రికీ ఉంటుంది.ముఖ్యంగా ఆడ‌వారు 40లోనూ ఇర‌వైలా మెరిసిపోవాల‌ని తెగ తాప‌త్రాయ ప‌డుతుంటారు.

అందుకోసం చ‌ర్మంపై ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లి వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.

స్కిన్ కోసం ఖ‌రీదైన క్రీమ్స్‌, సీర‌మ్స్‌, లోష‌న్స్ కొనుగోలు చేసి వాడ‌తారు.అయిన‌ప్ప‌టికీ ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ట్రై చేస్తే వ‌య‌సు పెరిగినా అందాన్ని కాపాడుకోవ‌చ్చు.య‌వ్వ‌నంగా మెరిసిపోనూవ‌చ్చు.

Advertisement
Do This If You Want To Look Youthful Even At 40 Years Old Details! Skin Care, Sk

మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో గుప్పెడు ఎండిన మ‌ల్లె పూలు, వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌లు వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు హీట్ చేస్తే జెల్లీ ఫామ్‌లోకి మారుతుంది.అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక ప‌ల్చ‌టి వ‌స్త్రం సాయంతో జెల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జెల్‌లో వ‌న్ టేబుల్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు బాగా మిక్స్ చేసుకోవాలి.

Do This If You Want To Look Youthful Even At 40 Years Old Details Skin Care, Sk

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ఒక బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే.వారం రోజుల పాటు యూస్ చేయ‌వ‌చ్చు.దీనిని ఎలా ఉప‌యోగించాలంటే.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

మొద‌ట‌ ముఖాన్ని వాట‌ర్‌తో ఒక‌సారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి రెండంటే రెండు నిమిషాల పాటు స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు చేస్తే ఏజింగ్ ఆల‌స్యం అవుతుంది.మ‌రియు యుఖం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

తాజా వార్తలు