మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:తల్లిదండ్రులు,బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని,పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని పోలీసు కేంద్ర కార్యాలయం నందు సోమవారం నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ ఈ విధమైన సూచనలు చేశారు.గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 10 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

ఫిర్యాదుదారులతో తానే స్వయంగా మాట్లాడి,వారి నుండి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశానని అన్నారు.ప్రతి ఫిర్యాదుదారునికి భరోసా కలిగించాలని అధికారులకు సూచించారు.

అకాల వర్షాలతో అపార నష్టం...రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్
Advertisement

Latest Suryapet News