Food After Sunset : సూర్యాస్తమయం తర్వాత.. ఈ ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకండి..

సూర్యాస్తమయం( Sunset ) తర్వాత మన శరీరం సహజంగా విశ్రాంతి కోసం సిద్ధమవుతుంది.

ఈ సమయంలో విశ్రాంతి కాకుండా ఇతర పనులలో నిమగ్నమవ్వడం వల్ల మన శరీరంలోనీ జీవ క్రియలు ప్రభావితమవుతాయి.

ఈ సమయంలో సరైన జీర్ణ క్రియ నాణ్యమైన నిద్ర మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మనం తినే ఆహారం( Food ) గురించి జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం.కొన్ని రకాల ఆహారాలు సూర్యాస్తమయం తర్వాత అసలు తినకూడదు.

సూర్యాస్తమయమైన తర్వాత కొన్ని ఆహారాలు తినడం వల్ల మన శరీరం సహజ పనితీరుకు అంతరాయం జరుగుతుంది.

Do Not Eat These Foods After Sunset

జీర్ణ వ్యవస్థలో అంతరాయం, శక్తి హెచ్చుతగ్గులు, నిద్ర సమస్యలు వస్తాయి.సూర్యాస్తమయం తర్వాత ఏ ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.చక్కెర,( Sugar ) అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్, ప్రాసెస్ చేసిన స్వీట్లు వంటివి అసలు తీసుకోకూడదు.

Advertisement
Do Not Eat These Foods After Sunset-Food After Sunset : సూర్యాస�

ఈ ఆహారాలు రక్తంలో చక్కర స్థాయిలను( Blood Sugar levels ) పెంచుతాయి.అలాగే ఉడకబేట్టిన పులుసు, మిరపపొడి వంటి మసల ఆహారాలు జీర్ణ వ్యవస్థను చికాకు పెడతాయి.

గుండెల్లో మంటను కలిగిస్తాయి.ముఖ్యంగా నిద్రపోయే ముందు తింటే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది.

ఈ ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను( Body Temperature ) పెంచుతాయి.నిద్రను కష్టతరం చేస్తాయి.

Do Not Eat These Foods After Sunset

అలాగే కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ ఇతర కెఫిన్( Caffeine ) కలిగిన పానీయాలు తక్కువగా తీసుకోవాలి.నిజానికి సాయంత్రం పూట వాటికి దూరంగా ఉండటమే మంచిది.ఎందుకంటే కెఫిన్ శరీర సహజ నిద్ర ను దూరం చేస్తుంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇది మొత్తం నిద్ర నాణ్యతను దూరం చేస్తుంది.అలాగే వేయించిన ఆహారాలు, కొవ్వు మాంసాలు, లేదా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు రాత్రి పూట తీసుకుంటే జీర్ణం కావడం కష్టమవుతుంది.

Advertisement

అలాగే నిద్రపోవడానికి ముందు అధిక మొత్తంలో ద్రవాలు అసలు తీసుకోకూడదు.ఇంకా చెప్పాలంటే నీరు అధిక మొత్తంలో తీసుకోవడం ఎలా రాత్రి పూట తరుచుగా బాత్రూంకి వెళ్లడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది.

నిద్రపోవడానికి ముందు నీరు పరిమితంగా తీసుకోవడమే మంచిది.సూర్యాస్తమయం తర్వాత ఈ చిట్కాలను పాటిస్తే మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు