తాగుబోతులు అర్ధరాత్రి అలా చేశారు.. నటి కీలక వ్యాఖ్యలు..?

బాలీవుడ్ సీరియల్స్ ను ఎక్కువగా చూసేవాళ్లకు ప్రాచీ టెహ్లాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దియా హౌర్ భారీ హమ్ అనే సీరియల్ ద్వారా ప్రాచీ టెహ్లాన్ పాపులారిటీని సంపాదించుకున్నారు.

అయితే తాజాగా ఈ నటి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.అర్ధరాత్రి సమయంలో తన కారును నలుగురు దుండగులు వెంబడించారని లైఫ్ లో ఎదురైన భయంకరమైన సంఘటన గురించి ఆమె తెలిపారు.

తాను కారులో వెళుతున్న సమయంలో భర్త కూడా తనతోనే ఉన్నాడని అయినప్పటికీ దుండగులు మాత్రం తనను వెంబడిస్తూ వచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.వాళ్లు తమను ఫాలో అవుతూ తమ ఏరియాలోకి కూడా వచ్చారని ఆమె అన్నారు.

వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో తెలియకపోవడం వల్ల తాను, తన భర్త చాలా టెన్షన్ పడ్డామని ఆమె పేర్కొన్నారు.రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆ తర్వాత తాను వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె అన్నారు.

Advertisement

ఎవరైతే వికృత చేష్టలకు పాల్పడతారో వాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రాచీ టెహ్లాన్ కోరారు.ఢిల్లీలో చదువుకున్న ప్రాచీ ఢిల్లీ అందమైన ప్రదేశమే అయినా సురక్షితమైన ప్రదేశం కాదని తెలిపారు.ఢిల్లీలో తాను నివశించిన సమయంలో తాను సురక్షితంగా ఉన్నానని అస్సలు భావించలేదని ఆమె చెప్పుకొచ్చారు.

ముంబై నగరం తనకు సురక్షితంగా ఉంటుందని అనిపించిందని ప్రాచీ టెహ్లాన్ పేర్కొన్నారు.

జూమ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రాచీ టెహ్లాన్ ఈ విషయాలను వెల్లడించారు.ఫ్యామిలీ పార్టీకి వెళ్లి వచ్చే సమయంలో ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగిందని ఆమె పేర్కొన్నారు.ప్రాచీ టెహ్లాన్ నటి కావడంతో పాటు క్రీడాకారిణి కూడా కావడం గమనార్హం.

ప్రాచీ టెహ్లాన్ హిందీతో పాటు మలయాళంలో కూడా నటించడం గమనార్హం.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు