క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

రాజాన్న సిరిసిల్ల జిల్లా: ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేల జిల్లా లో పకడ్బంది భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు.

శుక్రవారం రోజున ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు అయిన గూడెం, నామపూర్, ముస్తాబద్, పోతూగల్, బదనకల్ గ్రామాలను సందర్శించి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవవులసిన భద్రత చర్యల మీద అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.జిల్లాలో క్రిటికల్ గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునెల తగిన బందోబస్తు చర్యలను తీసుకోనున్నట్లు తెలిపారు.

పోలీస్ సిబ్బంది విసిబుల్ గా ఉంటూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను నిరంతరం సందర్శిస్తూ అక్కడి ప్రజలకు ప్రశాంత వాతావరణంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎటువంటి గొడవలు లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేలా తోడ్పాటు అందించాలని అవగాహన కల్పించాలన్నారు.క్రిటికల్ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, వాహన తనిఖీలు, నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు.

ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని,ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు.

Advertisement

అనంతరం ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బధనకల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.

ఎస్పీ వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి, ఎస్.ఐ శేఖర్ రెడ్డి ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News