రాజన్న సిరిసిల్ల జిల్లా : శనివారం రోజున ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకొని నేరాల నియాత్రణకు కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు ,సిబ్బంది విధులు నిర్వహించాలని, బ్లూకోట్స్ ,పెట్రో కార్ సిబ్బంది 24 గంటలపాటు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకరావలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి రోజు వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని అన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్బంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా, ఎన్నికల సమయంలో సమస్యలును సృష్టించే వారి పై పూర్తి నిఘా ఉంచాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరస్తుల, రౌడీ షీటర్ల వివరాలు,స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు.గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని,వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలన్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో జిల్లా , కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్,రూట్ మార్చ్ లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు.ఎస్పీ వెంట సి.ఐ సదన్ కుమార్,ఎస్.ఐ రాజు, సిబ్బంది ఉన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy