Mahi V Raghav : ఆ రాళ్లు ఎత్తే ఓపిక నాకు లేదు.. యాత్ర2 విమర్శలపై డైరెక్టర్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి.

ఈ బయోపిక్ సినిమాలలో రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ చిత్రాలు కూడా విడుదలవుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే డైరెక్టర్ మహి వి రాఘవ్( Mahi V Raghav ) దర్శకత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర( Yatra ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Director Mahi V Raghav React On Trolls On Yatra 2 Movie

యాత్ర 2( Yatra 2 ) పేరుతో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy ) ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆయన జైలుకు ఎలా వెళ్లారు.జైలు నుంచి వచ్చిన తర్వాత ఎన్నికలలో పోటీ చేయడం ఓడిపోవడం పాదయాత్రకు వెళ్లడం తిరిగి అధికారంలోకి రావడం లాంటి విషయాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.ఇలా రాజకీయాలకు సంబంధించిన సినిమా రాబోతుంది అంటే ఆ సినిమాపై ఎన్నో విమర్శలు రావడం సర్వసాధారణం తాజాగా ఈ సినిమా గురించి వస్తున్నటువంటి విమర్శల పట్ల డైరెక్టర్ రాఘవ్ స్పందించారు.

Director Mahi V Raghav React On Trolls On Yatra 2 Movie
Advertisement
Director Mahi V Raghav React On Trolls On Yatra 2 Movie-Mahi V Raghav : ఆ ర

ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై ఈయన స్పందిస్తూ.ఎప్పుడైనా రాజకీయ నాయకుల గురించి రాజకీయ నేపథ్యమున్న సినిమాలు కనుక చేస్తే ఆ సినిమాల పై రాళ్లు వేసే వాళ్ళు రాళ్లు వేస్తారు.బురద వేసే జల్లేవాళ్ళు జల్లుతారు.

ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని అయితే నాకు రాళ్లు ఎత్తే ఓపిక కానీ, బురద తుడుచుకొని ఓపిక కానీ లేదని తెలిపారు.అది నా జాబ్ కూడా కాదు ఎన్నో రకాల కామెంట్లు వస్తుంటాయి.

వాటిని చదివి పని లేని వాళ్ళు రిప్లై ఇస్తారు.మిగతా వాళ్ళు వదిలేస్తారు అంటూ డైరెక్టర్ మహి వి రాఘవ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు