రవి ఆ కారణంతోనే పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచారా... అసలు విషయం చెప్పిన యాంకర్!

బుల్లితెరపై ఎంతోమంది ఫిమేల్ యాంకర్స్ కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.అయితే మేల్ యాంకర్లు చాలా తక్కువగానే ఉన్నారని చెప్పాలి.

ఇలా వీరిలో ప్రదీప్ రవి( Ravi ) వంటి వారు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో రవి ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా రవి లాస్య కలిసి చేసే కార్యక్రమానికి మంచి రేటింగ్ కూడా వచ్చేది.ఇలా రవి లాస్య( Ravi Lasya ) మధ్య ఉన్న అనుబంధం చూస్తే ఖచ్చితంగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.

ఇకపోతే అప్పటికే రవి పెళ్లి చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చారు.కానీ రవి మాత్రం తన పెళ్లి విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు.ఈ విధంగా రవి తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచడానికి గల కారణాన్ని తాజాగా బయటపెట్టారు.

Advertisement

తన పెళ్లి గురించి రవి మాట్లాడుతూ తన ఉద్దేశంలో పెళ్లి చేసుకున్న వారంతా కూడా అంకుల్స్ అన్నది తన మైండ్ లో బలంగా నాటుకు పోయిందని తెలిపారు.ఇక తనకు పెళ్లి జరిగిందన్న విషయం తెలిస్తే తనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ తగ్గిపోతుందని అలాగే అవకాశాలు కూడా రాకుండా పోతాయని భావించినట్లు రవి తెలిపారు.

ఇలా పెళ్లి విషయం తెలిస్తే అవకాశాలు ఎక్కడ రావోననే ఉద్దేశంతోనే తను తన పెళ్లి విషయాన్ని దాచి పెట్టానని, అయితే తన పెళ్లి విషయాన్ని దాచి పెట్టడంతో తను ఎవరితో కలిసి యాంకరింగ్ చేసిన వారితో తనకు లింక్ పెడుతూ వార్తలు రావడంతో ఆ వార్తలకు చెక్ పెట్టడం కోసమే నిత్య( Nitya )తో తనకు పెళ్లి జరిగిన విషయాన్ని బయట పెట్టామని రవి ఈ సందర్భంగా తన పెళ్లి విషయం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అప్పటికే సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో తన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.ఈ వార్తలకు చెక్ పెట్టడానికి తన పెళ్లి ఫోటోని షేర్ చేశానని రవి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు