ఉగాదికి త్రివిక్రమ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడా.. ‘SSMB28’ నుండి క్లారిటీ అప్పుడే!

టాలీవుడ్ నుండి ప్రెజెంట్ తెరకెక్కుతున్న పలు క్రేజీ కాంబోల్లో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి.ఈ కాంబోలో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతుంది.

 Mahesh Babu Trivikram Ssmb28 Movie Latest Update On Ugadi-TeluguStop.com

మహేష్ బాబు( Mahesh Babu ) కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.త్రివిక్రమ్( Trivikram ) డైరెక్టర్ కావడంతో ముందు నుండి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు.

SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా రోజుల నుండి క్లారిటీ రావడం లేదు.

త్రివిక్రమ్ కొన్ని సెంటిమెంట్స్ బలంగా నమ్ముతాడు.అందులో ‘అ’ సెంటిమెంట్ ఒకటి.

ఈయన ఇప్పటి వరకు అ లెటర్ తో చాలా సినిమాలు తీయగా అన్ని సూపర్ హిట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అ సెంటిమెంట్ తోనే టైటిల్ పెట్టబోతున్నాడా అని అందరి మదిలో మెదిలే ప్రశ్న.ఇప్పటికే అతడే పార్ధు, అర్జునుడు అనే టైటిల్స్( SSMB28 Title ) వైరల్ అయ్యాయి.ఇక ఇప్పుడు అమ్మ కథ అనే సాఫ్ట్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు అనే టాక్ వస్తుంది.

మరి ఏది వాస్తవమో తెలియదు కానీ ఈ సినిమా టైటిల్ మాత్రం ఈ ఉగాది కానుకగా ప్రకటించే అవకాశం ఉందట.

ఏప్రిల్ నెలాఖరు నాటికీ టాకీ పార్ట్ మొత్తం షూట్ పూర్తి అవ్వనుంది.పాటలు, ఫైట్స్ మినహా మిగతా పార్ట్ మొత్తం పూర్తి అవ్వనుంది.మరి ఈ ఉగాదికి త్రివిక్రమ్ టైటిల్ ప్రకటించి సర్ప్రైజ్ ఇస్తాడో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా.

ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube