ఉగాదికి త్రివిక్రమ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడా.. ‘SSMB28’ నుండి క్లారిటీ అప్పుడే!
TeluguStop.com
టాలీవుడ్ నుండి ప్రెజెంట్ తెరకెక్కుతున్న పలు క్రేజీ కాంబోల్లో మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి.
ఈ కాంబోలో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతుంది.మహేష్ బాబు( Mahesh Babu ) కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
త్రివిక్రమ్( Trivikram ) డైరెక్టర్ కావడంతో ముందు నుండి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు.
SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా రోజుల నుండి క్లారిటీ రావడం లేదు.
త్రివిక్రమ్ కొన్ని సెంటిమెంట్స్ బలంగా నమ్ముతాడు.అందులో 'అ' సెంటిమెంట్ ఒకటి.
ఈయన ఇప్పటి వరకు అ లెటర్ తో చాలా సినిమాలు తీయగా అన్ని సూపర్ హిట్ అయ్యాయి.
"""/" /
ఇక ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అ సెంటిమెంట్ తోనే టైటిల్ పెట్టబోతున్నాడా అని అందరి మదిలో మెదిలే ప్రశ్న.
ఇప్పటికే అతడే పార్ధు, అర్జునుడు అనే టైటిల్స్( SSMB28 Title ) వైరల్ అయ్యాయి.
ఇక ఇప్పుడు అమ్మ కథ అనే సాఫ్ట్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు అనే టాక్ వస్తుంది.
మరి ఏది వాస్తవమో తెలియదు కానీ ఈ సినిమా టైటిల్ మాత్రం ఈ ఉగాది కానుకగా ప్రకటించే అవకాశం ఉందట.
"""/" /
ఏప్రిల్ నెలాఖరు నాటికీ టాకీ పార్ట్ మొత్తం షూట్ పూర్తి అవ్వనుంది.
పాటలు, ఫైట్స్ మినహా మిగతా పార్ట్ మొత్తం పూర్తి అవ్వనుంది.మరి ఈ ఉగాదికి త్రివిక్రమ్ టైటిల్ ప్రకటించి సర్ప్రైజ్ ఇస్తాడో లేదో చూడాలి.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా.ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నాని రెండు సినిమాలతో హిట్ కొడతాడా..?