పంట నిల్వ సమయంలో ఆశించు చీడపీడలు.. సంరక్షణ చర్యలు..!

పంటను పండించడం ఎంత కష్టమో.పంట తర్వాత ధాన్యాన్ని పీడల నుండి రక్షించడం కూడా అంతే కష్టం.

 Expect Pests During Crop Storage Preservation Measures , Preservation Measures,-TeluguStop.com

కాబట్టి కష్టపడి పండించిన ధాన్యాన్ని జాగ్రత్తగా నిలువ చేసుకోకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.పంట నిల్వ చేశాక, విత్తనాలు చెడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే: విత్తనంలో తేమశాతం అధికంగా ఉండడం, ఉష్ణోగ్రత( temperature ) ఎక్కువగా ఉండే గదులలో ధాన్యాన్ని నిల్వ చేయడం, పంట చేతికి వచ్చాక విత్తనాలను పూర్తిగా శుభ్రం చేయకపోవడం లాంటి కారణాల వల్ల చీడపీడలు పంటతో పాటు అలాగే ఉండి నిల్వ చేసాక పంటను ఆశించి నాశనం చేస్తాయి.అంటే పంటను పూర్తిగా శుభ్రం చేయకపోతే, విత్తనాలపై పురుగులు గుడ్లు పెట్టి, వాటి ఉధృతి పెరుగుతుంది.ఇంకా నిల్వ చేసే గోనే సంచులలో కూడా శిలీంద్రాలు, పురుగుల గుడ్లు ఉండే అవకాశం ఉంది.

పంటను తరలించే వాహనాలైన ట్రాక్టర్లు లారీలు వంటివి అపరిశుభ్రంగా ఉన్నా కూడా వాటిలో ఇంతకుముందు ఉండే పురుగుల వల్ల పంటకు నష్టం కలిగి అవకాశం ఉంది.

Telugu Agriculture, Deltamitrin, Insects, Latest Telugu, Temperature-Latest News

మరి పంటనిల్వాలో తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వస్తే, ముఖ్యంగా పంట శుభ్రం చేసేటప్పుడే పురుగు పట్టిన గింజలను వేరు చేయాలి.పంట కోత సమయంలో సుమారు 24 శాతం వరకు తేమ ఉంటుంది.కాబట్టి దాదాపు 12 నుండి 14% వరకు తేమ తగ్గేలా ఎండలో విత్తనాలను ఆరబెట్టాలి.

ఇక వేరుశెనగల విషయానికి వస్తే తేమ ఏడు శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.నిలువ చేస్తున్న గదిని పూర్తిగా శుభ్రం చేయాలి.ఏమైనా అనుమానం ఉంటే గదిలో 3 లీటర్ నీటిలో 50 గ్రాముల డెల్టామిత్రిన్( Deltamitrin ) కలిపి పిచికారి చేయాలి.పాతధాన్యాన్ని, కొత్త ధాన్యాన్ని కలిపి ఒకే చోట నిల్వ చేయకూడదు.

బస్తాలను తేమ లేకుండా పొడిగా ఉండే ప్రదేశాలలో గోడలకు తగలకుండా నిల్వ చేయాలి.తర్వాత సంచుల వరుసలకు మధ్య ఓ రెండూ అడుగుల దూరం ఉంటే విత్తనాలను, పురుగులు ఆశించినప్పుడు గమనించి చర్యలు తీసుకోవచ్చు.బయట నుండి కీటకాలు( Insects ) గదిలోకి ప్రవేశించకుండా, గదిలోపల కన్నాలు లాంటివి లేకుండా జాగ్రత్త పడాలి.15 రోజులకు ఒకసారి ధాన్యాన్ని ఇరువైపులా తిరిగి గమనించాలి.ఏమైనా పురుగులు లాంటివి కనిపిస్తే తక్షణం చర్యలు తీసుకోవాలి.వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహాలతో నిల్వ ఉంచిన ధాన్యంపై అప్పుడప్పుడు పిచికారి చేస్తూ ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube