కర్నూలు జిల్లాలో వజ్రాల వేట.. 2 వజ్రాలు లభ్యం

సాధారణం తొలకరి వర్షాలు పడితే ఏం చేస్తారు.వ్యవసాయం చేసుకోవడానికి పొలం దున్ని విత్తనాలు వేయడానికి రెడీ అవుతుంటారు.

కానీ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షం పడినప్పుడు గ్రామ ప్రజలు, రైతులు, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వజ్రాల వేటకు వెళ్తుంటారు.అందుకే రాయలసీమను రతనాల సీమగా పిలుస్తారు.

ఏట ఇక్కడ వర్షాకాలం ప్రారంభంలో 50-60 వజ్రాల దాకా దొరుకుతుంటాయని అంచనా.తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వజ్రాల వేట కోసం కర్నూల్ వస్తుంటారు.

కర్నూల్, అనంతపురం జిల్లాల సరిహద్దులోని పంటపొలాల్లో వజ్రాలు లభిస్తాయి.తొలకరి చినుకులతో దుమ్ముపట్టిన వజ్రాలు తడిసి సూర్యుడి కాంతి తగిలి మెరుస్తుంటాయి.

Advertisement

తాజాగా కర్నూల్ జిల్లాలో రెండు వజ్రాలు దొరికాయి.జొన్నగిరిలో వ్యవసాయ కూలీకి, తుగ్గలికి చెందిన మరో కూలీకి కలిపి రెండు వజ్రాలు లభ్యమయ్యాయి.ఓ వ్యాపారి ఈ రెండు వజ్రాలను రూ.3 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.అయితే గతేడాది ఓ రైతుకు వజ్రం దొరికితే దానికి రూ.60 లక్షలు చెల్లించి ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు.కర్నూల్ లోని ఆదోని డివిజన్ లోని పెరవలి, ఎర్రగుడి, జొన్నగిరి, మద్దికెర, తుగ్గలి, అగ్రహారం, గిరిగెట్ల తదితర ప్రాంతాల్లో వజ్రాలు దొరకడం కామన్.

వజ్రాలు దొరకడం వల్ల ఈ గ్రామాలకు ప్రత్యేక ప్రాముఖ్యతను గడించాయి.ప్రతి ఏడాది ఈ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతూనే ఉంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు