కాలికి కట్టు కట్టుకొని ఢీ షోలో డ్యాన్స్.. ప్రియమణి, నందితలు ముద్దుల వర్షం?

బుల్లితెరలో ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి.

ఇక ఈ మధ్య మరిన్ని షోలు ప్రారంభం కాగా అందులో పాల్గొనే సెలబ్రెటీలు, యాంకర్లు, జడ్జీలు మాత్రం ఓ రేంజ్ లో హద్దులు దాటుతున్నారు.

తమ నోటికి వచ్చిన డబల్ మీనింగ్ డైలాగులతో, హగ్ లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతున్నారు.నిజానికి ఒకప్పటి షోలు ఇలాగా ఉండేవి కావు.

పైగా అప్పట్లో మంచి వస్త్రధారణలు, ప్రేక్షకులను ఆకట్టుకునే మాటలు, ఆటలు మాత్రమే ఉండేవి.కానీ ఇప్పుడు అవన్నీ లేవనే చెప్పవచ్చు.

నిజానికి వాటికి బదులు రెట్టింపు స్పైసీలను కలుపుతున్నారనే చెప్పవచ్చు.నిజానికి షోలో చేసే పర్ఫామెన్స్ ఒకటైతే అందులో పాల్గొనే కంటెస్టెంట్ లు చేసే పర్ఫామెన్స్ లు మాత్రం వేరొకటిగా ఉంటాయి.

Advertisement
Dhee Show Dancer Prasad Dance Performance With Leg Injury Details, Dhee Show, D

ఇదిలా ఉంటే ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో గురించి అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఎన్నో సీజన్ లు పూర్తవగా ప్రస్తుతం మరో సీజన్ తో బాగా రెచ్చిపోతుంది.

ఇందులో ప్రదీప్ యాంకర్ గా చేయగా.ప్రియమణి, నందితా, జానీ మాస్టర్ జడ్జీలుగా చేస్తున్నారు.

అంతేకాకుండా హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

Dhee Show Dancer Prasad Dance Performance With Leg Injury Details, Dhee Show, D

ఇదివరకు ఇందులో సుడిగాలి సుధీర్, రష్మీ లు టీమ్ లీడర్ గా ఉండి ఎంత సందడి చేశారో చూశాం.ఇక ఇప్పుడు అంతా కొత్తవాళ్ళే కనిపిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఢీ షోకి సంబంధించిన వచ్చే ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో యాంకర్, టీమ్ లీడర్లు తమ పంచ్ లతో బాగా సందడి చేశారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇక ఇందులో ఓ డాన్సర్ ప్రసాద్ కాలికి కట్టుతో వచ్చి రారా బంగారం సాంగ్ కు డాన్స్ చేశాడు.ఇక ఆయన చేసిన స్టెప్ లను అక్కడున్న వారంతా చూసి ఫిదా అయ్యారు.

Advertisement

ముఖ్యంగా జడ్జీలు ప్రియమణి, నందిత మాత్రం అతడి పర్ఫామెన్స్ కు బాగా ఫిదా అవుతూ ఏకంగా స్టేజి మీదికి వెళ్లి బుగ్గ మీద ముద్దులు పెట్టారు.

పక్కనే ఉన్న జానీ మాస్టర్ అది చూసి భుజంపై కర్చీఫ్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హైపర్ ఆది ఒక కౌంటర్ కూడా వేశాడు.ఇక ప్రసాద్ ప్రోగ్రాం లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాలికి దెబ్బ తగలడంతో అతడి షో నుంచి కొన్ని రోజులు తప్పుకున్నాడు.మళ్లీ ఇంత కాలం తర్వాత అతడు స్టేజి పైకి వచ్చి తన గాయంతో డాన్స్ చేయగా ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా ఫిదా అయ్యారు.

ఇక ఈ ప్రోమోని చూసిన నెటిజన్లు హగ్, ముద్దులతో రెచ్చిపోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి కొంతమంది ప్రసాద్ అలా ఉన్నా కూడా తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో బాగా అదరగొట్టాడు అని.కాలికి గాయం అయినా కూడా తన సహనంతో అద్భుతంగా చేశాడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా వార్తలు