శివ నామస్మరణ తో మార్మోగుతున్న రాజన్న ఆలయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం శివ నామస్మరణతో మార్మోగుతుంది.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు.

ఈ సందర్బంగా వేములవాడ ఎం.ఎల్.ఏ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఆవరణలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు.క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు.

పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు పరిశీలించి, నిర్వాహకులు, వాలంటీర్లను విప్ అభినందించారు.అనంతరం స్వామి వారిని విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

అలాగే కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయ ఆవరణలో పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు చేశారు.

Advertisement

Latest Rajanna Sircilla News