వైరల్: బైక్‌పై మహిళ చేసిన పనికి సైబరాబాద్ పోలీసులు ట్రోలింగ్..!

వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు.

వారి క్రియేటివిటీతో చెప్పాలనుకుంటున్న విషయాన్ని సూటిగా చెప్పి ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు.

అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని తమదైన శైలిలో ట్రోల్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.ఇప్పుడు కూడా వారు చేసిన ట్రోలింగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

తాజాగా బండిపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు పోలీసులు.ఈ ఫొటోలో యువకుడు బైక్ నడుపుతుండగా వెనుక ఒక యువతి కూర్చుంది.

బైక్‌పై ప్రయాణం చేస్తున్న డ్రైవర్‌తో సహా వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ దర్శించాలనే ఓ ట్రాఫిక్ రూల్ ఉంది.అయితే ఈ యువతి మాత్రం హెల్మెట్ ధరించలేదు సరికదా.

Advertisement
Cyberabad Traffic Police Traffic Police Trolling Woman Using Plastic Cover Inste

కవర్‌ను హెల్మెట్‌లా వాడి షాకిచ్చింది.ఈ ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.

‘‘హెల్మెట్ తలకు పూర్తిగా కవర్ అయి ఉండాలి అన్నారు.కానీ కవర్‌నే హెల్మెట్‌లా వాడమనలేదు.

’’ అంటూ పోలీసులు చమత్కరించారు.అదే ట్వీట్ కింద హెల్మెట్ పెట్టుకోండి.

సురక్షితంగా ఉండండి అంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Cyberabad Traffic Police Traffic Police Trolling Woman Using Plastic Cover Inste
ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

దాంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.పోలీసుల సెన్సాఫ్ హ్యూమర్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.హెల్మెట్ కవర్ చేసుకోవాలని చెప్తే ఆమె ఏకంగా కవర్ తెచ్చుకుందేంటీ అని రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

బండికి నంబర్ ప్లేట్ కూడా లేదంటూ కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు.ఇటువంటి వాహనదారులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.అయితే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని శిక్షించాలి.

కానీ భారీ ఎత్తున జరిమానా విధించకూడదు అని కొందరు అంటున్నారు.

తాజా వార్తలు