ఆక్స్‌ఫర్డ్ జతగా వ్యాక్సిన్: సీరం ఇన్‌స్టిట్యూట్‌పై న్యూయార్క్‌ టైమ్స్ కథనం

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పూణేలోని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది.

వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేయడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తోన్న ఆక్స్‌ఫర్డ్ సంస్థ సైతం సీరంతో జతకట్టడంతో దీని పేరు అంతర్జాతీయ స్థాయిలో సైతం మారుమోగుతోంది.

తాజాగా సీరంపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.పూణే కేంద్రంగా నడుస్తున్న సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాను 50 ఏళ్ల క్రితం పూణావాలా కుటుంబం స్థాపించింది.

తొలినాళ్లలో ఇది హార్స్ బ్రీడింగ్ ఫార్మ్‌గా ఉండేది.అంటే ఇక్కడి గుర్రాలను వ్యాక్సిన్ ప్రయోగం కోసం వ్యాక్సిన్ ల్యాబొరేటరీలకు దానంగా ఇచ్చేవారు.

అయితే ఇది ఇతరులు ఎందుకు చేయాలి.తామే వ్యాక్సిన్ తయారు చేయొచ్చనే ఆలోచనా అధార్ పూణావాలా తండ్రి సైరస్ వాలాకు తట్టింది.

Advertisement
Oxford Coronavirus Vaccine Trials New York Times Special Story On Serum Institut

దీంతో ఆయనే ఈ సంస్థలో గుర్రాలకు ట్యాక్సిన్స్ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి ఆపై గుర్రాల రక్తం నుంచి బ్లడ్ సీరంను తీసి వాటితో వ్యాక్సిన్ తయారు చేశారు.

Oxford Coronavirus Vaccine Trials New York Times Special Story On Serum Institut

ఆ విధంగా తొలుత 1967లో టెటానస్ వ్యాక్సిన్‌‌‌ను తయారు చేశారు.ఆ రోజుల్లో దేశాన్ని గడగడలాడించిన టీబీ, హెపటైటిస్, పోలియో, ఫ్లూ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు వ్యాక్సిన్‌ను సీరం తయారు చేసింది.ఈ సంస్థ సత్తాను గుర్తించిన యూనిసెఫ్, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థల నుంచి భారీగా కాంట్రాక్టులు వచ్చాయి.

ప్రపంచంలోని సగానికి పైగా చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్‌ సీరం సంస్థలో తయారైనదే కావడం విశేషం.ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు 450 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నట్లు పూణావాలా చెప్పారు.

Oxford Coronavirus Vaccine Trials New York Times Special Story On Serum Institut

ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్‌ను 50 శాతం భారత్‌కు వినియోగించి.మరో 50 శాతం ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తామని పూణావాలా చెప్పారు.ఇందులో ఎక్కువగా పేద దేశాలకే ఎగుమతి చేస్తామని చెప్పడంతో ఇందుకు ప్రధాని కూడా ఒప్పుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
కొన్ని గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్‌ను నిలిపివేసిన ట్రంప్ .. భారతీయులపై ప్రభావమెంత?

కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలతో సీరం జతకట్టింది.ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ విజయవంతమైనట్లు ఇటీవల ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది.

Advertisement

ఇప్పుడు, రెండు.మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది.

అయితే ఈ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా బాధ్యతను మాత్రం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది.

తాజా వార్తలు