కరోనా నివారణకు ఆ రెండు మందులు వాడొద్దు: సుప్రీంకోర్టులో ఎన్ఆర్ఐ డాక్టర్ పిటిషన్

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింత భయానక పరిస్ధితులను సృష్టిస్తోంది.ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 1.

37 లక్షల మంది మరణించగా, లక్షలాది మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.రోజుల తరబడి ప్రయోగాలు చేస్తున్నప్పటికీ పరిశోధకులు మాత్రం ఇప్పటి వరకు టీకాను కొనుక్కోలేకపోయారు.

అయితే చీకటిలో చిరుదీపంలా మలేరియా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కరోనా రోగులకు అందించడం వల్ల సత్ఫలితాలు కనిపించాయని పలు దేశాల పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ఈ డ్రగ్‌కు ఎక్కడా లేని గిరాకీ ఏర్పడింది.

దీని ఉత్పత్తి, నిల్వలు, సరఫరాలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండటంతో అన్ని దేశాలు మనదేశంవైపు క్యూకడుతున్నాయి.

Advertisement

అయితే అమెరికాలో స్థిరపడిన కునాల్ సాహా అనే ఎన్ఆర్ఐ డాక్టర్ భారతదేశంలో కరోనా రోగులకు అందిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హెచ్‌సీక్యూ, ఏజెడ్‌ఎం వినియోగం డైరెక్ట్ సైంటిఫిక్ డేటా ఆధారంగా లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ రెండు మందుల వాడకం ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని సాహా వాదిస్తున్నారు.

విషమ పరిస్ధితుల్లో ఉన్న కరోనా రోగుల చికిత్స కోసం ప్రస్తుత మార్గదర్శకాలలో అవసరమైన మార్పులు చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించాల్సిందిగా కునాల్ సాహా అత్యున్నత ధర్మాసనాన్ని కోరారు.

ఏప్రిల్ 8న అమెరికాలోని అమెరికర్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ), అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ఏసీసీ), హార్ట్ రిథమ్ సొసైటీ (హెచ్ఆర్ఎస్) ఉమ్మడి బులెటిన్ జారీ చేసింది. కోవిడ్ 19 బాధితులకు హెచ్‌సీక్యూ, ఏజడ్ఎం వాడకం మంచిది కాదని.ప్రత్యేకించి అప్పటికు గుండె జబ్బులు ఉన్న వారిలో అసాధారణ హృదయ స్పందన, గుండె ఆగిపోవడం చివరికి మరణాన్ని కూడా ప్రేరేపించే అవకాశం ఉందని ఆ బులెటిన్‌లో తెలిపారు.

దీనిని కునాల్ సాహా తన పిటిషన్‌లో పొందుపరిచారు.కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ వినియోగంలో ఎదురవుతున్న ప్రాణాంతకమైన ప్రమాదాల గురించి తాను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశానని .కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని కునాల్ సాహా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

జీవీ ప్రకాష్ సైంధవి విడిపోవడానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే విడిపోతున్నారా?
Advertisement

తాజా వార్తలు