ఏలూరు వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్ !

ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది.

సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ ఈ కరోనా భారిన పడుతున్నారు.

ఇక ఈ మధ్య కరోనా భారిన పడే ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.

తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది.ప్రస్తుతం ఎంపీ కోటగిరి శ్రీధర్ హైదరాబాద్‌ లో హోమ్ ఐసోలేషన్ ‌లో ఉంటూ కరోనాకి చికిత్స తీసుకుంటున్నారు.

ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కరోనా నిర్దారణ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

బుధవారం నాటి బులెటిన్ ప్రకారం.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 5120 కేసులు నమోదయ్యాయి.

వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 731532కు చేరుకుంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 6349 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

దీంతో ఏపీలో ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 675933‌కు చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 49513గా ఉంది.

రోజా పొలిటికల్ సైలెన్స్ అందుకేనా ? 
Advertisement

తాజా వార్తలు