ఘనంగా కామ్రేడ్ ధర్మబిక్షం 102 వ జయంతి

సూర్యాపేట జిల్లా: ధర్మభిక్షం జీవిత పుస్తకంలోని ప్రతి పేజీ ప్రతి మాట ప్రతి అక్షరం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.

కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 102 వ జయంతి( Dharmabiksham ) సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ నవాబుపై ప్రజా సైన్యంతో తిరుగుబాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మభిక్షం అన్నారు.తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో నిజాం నవాబు పాలన కింద ఉన్న సూర్యాపేటలో విద్యార్థులకు హాస్టల్ పెట్టి వారికి విద్యాబుద్ధులతో పాటు సామాజిక చైతన్యాన్ని నేర్పించాడన్నారు.

నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన ఘనత ఆయనదే అన్నారు.గీత పనివారల కార్మికుల సమైక్యతను స్థాపించి స్వచ్ఛమైన ప్రకృతి పానీయమైన కల్లును ఆహార పానీయమని, విటమిన్లు,పోషక పదార్థాలు కలిగిన కల్లును రక్షించుకోవాలని ఆయన చేసిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు.

ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్,సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లేశ్వరి,గీత పనివారాల రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్,పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు,ఎఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్,మట్టిపల్లి సైదులు,ఖమ్మంపాటి రాము,దీకొండ శ్రీనివాస్, రేగటి లింగయ్య,బూర రాములు,పోలగని రవి గోపగాని రవి,వాడపల్లి గోపి,వాడపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

హుజూర్ నగర్ గృహజ్యోతి పథకానికి పట్టిన గ్రహణం

Latest Suryapet News