తండ్రైన రాహుల్ రామకృష్ణ... కొడుకు పుట్టిన సంతోషంలో కమెడియన్!

అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు, RRR వంటి సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఒకరు.

ఈయన వరుస సినిమాలలో కామెడీ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఇలా కమెడియన్ గా సినీ కెరియర్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈయన సోషల్ మీడియాలో మాత్రం తరచు ఏదో ఒక వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు.ఈయన చేసే పోస్టులన్నీ కూడా కాస్త పరుష పదాలతో ఉండటం వల్ల ఈయన వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు.

ఇకపోతే ఈయన వృత్తిపరమైన జీవితం ఎంతో సక్సెస్ గా ముందుకు సాగుతున్నప్పటికీ ఈయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో గంధర గోలంగా ఉంది.గతంలో ఒకసారి ఈయన ఓ అబ్బాయికి కాబోయే భార్య అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోని షేర్ చేయడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ తనకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈయన పెళ్లి తేదీని మాత్రం ప్రకటించకపోయినా గత ఏడాది నవంబర్ నెలలో తన భార్య ప్రెగ్నెన్సీగా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే తండ్రి కాబోతున్నానే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఈయన తన భార్య ప్రెగ్నెన్సీ ఫోటోలను షేర్ చేయడంతో అసలు రాహుల్ రామకృష్ణ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు అటు కొందరు సందేహాలను వ్యక్తపరిచారు.

Advertisement

అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన తన కుమారుడు జన్మించారని సినిమా భాషలో సంక్రాంతి రిలీజ్ అంటూ తన కుమారుడి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.ఈ క్రమంలోనే రాహుల్ రామకృష్ణ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు