పవన్, చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు

ఏపీ విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.

పవన్, చంద్రబాబులను చూస్తే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనిపిస్తుందని సీఎం జగన్ తెలిపారు.పవన్ కు నిర్మాత, దర్శకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు కాల్షీట్లు ఇస్తాడని విమర్శించారు.బాబు చెప్పిన డైలాగులకు యాక్ట్ చేసి చూపిస్తాడన్నారు.

సింధూకి బ్యాడ్మింటన్ నేర్పింది కూడా తానేనని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు.

Advertisement

ఈ ఇద్దరి స్టైల్ ఒక్కటేనన్న సీఎం జగన్ ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమంటూ వెళ్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు