6 రోజుల క్రింద ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాల స్వామి ఆలయం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశాం.
సంవత్సరన్నర లో పూర్తి చేస్తాంవిద్యతోనే వికాసం, అభివృద్ధి తరగతులు భారత దేశ భవిష్యత్తు కు విజ్ఞాన ఖనీ లు సిరిసిల్ల నియోజకవర్గం( Sirisilla Constituency )లోని మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రసిద్ధి సంస్థలలో పని చేస్తున్నారు.
అమెరికా లో ఎక్కడ పోయిన తెలుగు, తెలంగాణ ప్రజలు కోకొల్లలు గా వస్తారు.వారిని చూస్తే సంతోషముగా అనిపిస్తది.
ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ ఫలితాలుఅమెరికా( America ) లో కూడా పేదలు ఉన్నారు.ఉన్నంతలో ఎంత చేశామో ఆలోచించండి.9 ఎండ్ల కింద విద్యా, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాలు ఎంట్లుండే.ఇప్పుడు ఎట్లుంది బేరీజు వేసుకోవాలి తండాలు జీపీ లుగా చేశాం ఎవరి వల్ల రాష్ట్రం బాగు అవుతుందో ఆలోచించాలి.
సరైన దిశలో వేలుతున్నమా లేదో ఆలోచించాలి.శాస్త్రీయ విధానంలో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం.57 ఎండ్లలో గుడి , బడిని పట్టించుకోలే.సాగునీటి గోస తీర్చలే9 ఎండ్లలో అనేక సమస్యలకు పరిష్కారం చూపాoఎల్లారెడ్డి పేట కు బారాబర్ డిగ్రీ కళాశాల ను సిఎం కేసిఆర్( CM KCR ) సరైన సమయంలో మంజూరు చేస్తారు.
పలకతో వచ్చి పట్టా తో.వెళ్ళాలనే గంభి రావు పేట లో కేజీ టు పీజీ క్యాంపస్ ఏర్పాటు చేశాం3 దశల్లో 510 ప్రభుత్వ పాఠశాలల్లో 12 మౌలిక సదుపాయాల,వసతులు సమకూరుతాయి .ఏ ఊరికి వెళ్ళినా కోట్లాది రూపాయలతో చేపట్టిన 60 పాటశాలల్లో 22 వేల మంది విద్యార్థులకు కంప్యూటర్ చాంప్స్ పేరుతో బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తున్నాం.రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలకు టీ ఫైబర్ తో అనుసంధానం చేయనున్నాం.
సిరిసిల్ల ఇప్పటికే అనేక అంశాల్లోదేశంలోనే ముందుంది.దేశంలో విద్య విషయంలో బెస్ట్ స్కూల్ ఎక్కడా ఉన్నాయంటే సిరిసిల్ల అనే పేరు రావాలి .పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మానవ సంబంధాలు, జీవ కారుణ్యo పై పాటలలో భాగస్వామ్యం చేయాలిప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లల కు సెల్ఫ్ డిఫెన్స్ పై శిక్షణ ఇస్తాం.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లో మండలాలు, ప్రజా ప్రతినిధులు పోటీ పడాలి.రాజన్న సిరిసిల్ల జిల్లాను విద్యా ప్రమాణాలలో దేశంలోనే ఆదర్శంగా నిలవాలి.
మంత్రి కే టి రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యతోనే వికాసం.విజ్ఞానం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుంది.అది ఒక తరగతి గది కాదు.
ఒక విజ్ఞానపు గని.తరగతి గది నాలుగు గోడలు భారతదేశ భవిష్యత్‌కు మూలస్తంభాలు అని చెప్పక తప్పదు.
ఈ మాట చెప్తే అతిశయెక్తి అనిపించొచ్చు.కానీ ఇది వాస్తవం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేటలో రూ.8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సరిగ్గా వారం రోజుల కిందట ఇదే ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాల స్వామి గుడి పునర్నిర్మాణం కోసం పూజ చేసుకున్నాం అని కేటీఆర్ గుర్తు చేశారు.సంవత్సరన్నర లోపల లఅద్భుతమైన ఆలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి సిరిసిల్ల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతామన్నారు.
ఇప్పుడు ఈ పాఠశాలను చూస్తుంటే మేం మళ్లీ చదవుకోవాలనే ఉత్సాహం ఉంది.సంవత్సరన్నర పాటు ఈ పాఠశాల పునర్నిర్మాణానికి కష్టపడిన కూలీలందరికి అభినందనలు.విద్యార్థులకు మంచి వసతులు కల్పిస్తున్నాం.
అద్భుతాలు సృష్టించాం అని కేటీఆర్ తెలిపారు.అమెరికాలో ఎక్కడ పోయిన తెలుగు, తెలంగాణ ప్రజలు కోకొల్లలుగా తన దగ్గరకు వస్తుంటారని కేటీఆర్ తెలిపారు.
వారిని చూస్తే సంతోషము అనిపిస్తది.మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడుతున్నారు.
అమెరికాలోనూ నిరుపేదలు ఉన్నారు.అక్కడ కూడా తిండికి తిప్పలు ఉన్నాయి.
వ్యవస్థలో లోపాలు వెతకాలనుకుంటే.ఎప్పటికీ ఉంటాయి.
కానీ ఉన్నంతలో ఏమేం మంచిగ చేశామో ఆలోచించాలి.ఆలోచించండి.
ఆగం కాకండి.తొమ్మిదేండ్ల క్రితం మన బడి ఎలా ఉండే.
ఇప్పుడు ఎలా అయిందనే విషయాన్ని ఆలోచించండి.తెలంగాణ భూతల స్వర్గం అయిందని తాను అనడం లేదు.
చేయాల్సింది ఇంకా చాలా ఉంది.ప్రభుత్వం యొక్క నిబద్ధతత, చిత్తశుద్ధి గురించి ఆలోచించాలి.
గతంలో తండాలను ఎవరూ పట్టించుకోలేదు.నేడు కేసీఆర్ నాయకత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లో ప్రాధాన్యత పరంగా ఒక్కో సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.చిన్నారుల బంగారు భవిష్యత్తు పై మరింత దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
చిన్నారుల ఎట్లా తీర్చిదిద్దాలి.వాళ్ళ కాళ్ల పై ఎట్లా నిలబడేలా చేయాలో.
ఇరుగు పొరుగుతో ఎట్లా మసులు కోవాలో, సంతోషంగా ఎట్లా జీవించాలలో కరి కులమ్ లో ప్రభుత్వం పొందుపరనుందన్నారు.విద్యార్థులు మెరుగైన మానవ సంబంధాలు ఎలా నెలకొల్పేలా బోధన లో భాగంగా శిక్షణ ఇచ్చేలా చూస్తామని చెప్పారు.
అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట ఎడ్యుకేషన్ క్యాంపస్ చాలా చక్కగా ఉందని ఇట్లాంటి క్యాంపస్ కోనరావుపేట మండల కేంద్రంలో కూడా నిర్మించాలని మంత్రి కెటిఆర్ కు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ వైద్యశాల కూడా జిల్లా కేంద్రంలో ఏర్పాటు అవుతుందన్నారు.
తద్వారా విద్యార్థులు డాక్టర్ కావాలన్న తమ స్వప్నాన్ని కూడా నెరవేర్చుకునే అవకాశం లభించింది అన్నారు.ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో విద్యాభివృద్ధికి బంగారు బాటలు పడ్డాయని అన్నారు.
అలాగే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక విద్యా స్వరూపం పూర్తిగా మారిపోయిందన్నారు.తెలంగాణ అస్తిత్వం, చరిత్రకు, భాషకు ,యాసకు ప్రాధాన్యత పెరిగిందన్నారు.
తెలంగాణ మహనీయులకు స్థానం లభించింది అన్నారు.అలాగే టేస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ స్వరాష్ట్రం తెలంగాణలో గణనీయమైన విద్యాభివృద్ధి జరిగిందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ( Anuraag Jayanti )మాట్లాడుతూ.ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం కింద మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 12 కేటగిరీలకు చెందిన మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపడుతుందన్నారు.
తొలి విడుతలలో జిల్లాలో 172 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పన పనులు చేపట్టామన్నారు.వాటిలో ఇప్పటికే 10 పాఠశాలల్లో పనులు పూర్తయి ప్రారంభించుకున్నామన్నారు.
మిగతా పనులు ప్రగతిలో ఉన్నావని సాధ్యమైనంత త్వరగా వాటిని కూడా ప్రారంభించుకుంటామన్నారు.అంతకుముందు మంత్రిగంభీరావుపేట మండలం గోరంట్యాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
వాలీబాల్ అకాడమీ ప్రారంభించిన మంత్రి సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీ ని రాష్ట్ర మంత్రి శ్రీ కెటి రామారావు( K.T.Rama Rao ) మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.అనంతరం మంత్రి క్రీడాకారులతో కరచాలనం చేశారు.
క్రీడలు దేహ దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు.క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి , రాష్ట్ర టెక్స్ట్ టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఆర్డీఓ టి శ్రీనివాసరావు , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy