శివ శంకర్ మాస్టర్ మృతిపట్ల స్పందించిన చిరంజీవి..!!

ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మరణించడం జరిగింది.

కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయనకి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ భారీగా ఉండటంతో.

గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేయడం జరిగింది.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ చికిత్స నిమిత్తం ఆయన కుటుంబానికి మూడు లక్షల రూపాయలు సహాయాన్ని అందించారు.

కాగా ఆయన మరణించడంతో చిరంజీవి తాజాగా శివ శంకర్ మాస్టర్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.సోషల్ మీడియా వేదికగా చిరంజీవి స్పందిస్తూ "శివ శంకర్ మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది.ఆయన నేను కలిసి చాలా సినిమాలలో పని చేసాం.

ఖైదీ సినిమాతో మా స్నేహం మొదలైంది.ఇటీవల ఆచార్య సినిమా సెట్ లో కలుసుకున్నాం.అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు.

Advertisement

ఓ ఆత్మీయుడిని కోల్పోయినట్టే.ఆయన మృతి నృత్యకళ కే కాదు.

యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని చిరంజీవి.శివ శంకర్ మాస్టర్ మృతిపట్ల రియాక్ట్ అయ్యారు.

ఇక ఇదే సమయంలో నటుడు సోనూసూద్ కూడా స్పందిస్తూ శివ శంకర్ మాస్టర్ చనిపోయాడన్న వార్త విని ఎంతో బాధపడ్డా.ఆయన కాపాడుకోవడానికి మా వంతు ప్రయత్నం చేశాం.

కానీ భగవంతుడు ఇలా చేశాడు.శివ శంకర్ మాస్టర్ నీ ఇండస్ట్రీ చాలా మిస్ అవుతుంది ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఇంకా చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు