చిరంజీవి మీద జోకులు బాగా వేస్తున్నారు

రేమేకులు చేయడం బాక్సాఫీస్ దగ్గర సేఫ్ ఏమో కాని, ఒక యాక్టర్ గా పెద్దగా పేరు రాదు.

ప్రతి చిన్న విషయానికి ఒరిజినల్ లో చేసిన యాక్టర్ తో పోల్చి చూస్తారు.

మరి మన మెగాస్టార్ మాత్రం తన పునరాగమనం కోసం ఓ రీమేక్ నే ఎంచుకున్నారు.విజయ్ నటించిన కత్తి చిత్రాన్ని ఖైదీ నం150 పేరుతొ తీస్తున్న చిరంజీవి ఇంటర్నెట్ జోకులకి బలవుతున్నారు.

మొన్న విడుదలైన టీజర్ పెద్దగా సంతృప్తిపరచలేదు.ఈ సినిమా కత్తికి రీమేక్ లా లేదు స్పూఫ్ విడియోలా ఉంది అని ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.

ఇదే చిరంజీవి రీమేక్ కాకుండా, కొత్త కథతో సినిమా చేసుంటే ? ఇలా విజయ్ తో పోల్చి జోకులు పేల్చే అవకాశం ఉండేది కాదు.ఇక నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ని తాను తీసుకొని ఎప్పుడో తప్పు చేసారు మెగాస్టార్.

Advertisement

ఆ ప్రోమొలను చూసి, నాగార్జునతో పోలుస్తూ ఎప్పటి నుంచో జోకులు వదులుతున్నారు ఆన్ లైన్ ప్రజానికం.అందుకేనేమో .మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఈ రేమేకుల జోలికి వెళ్ళరు.తమని ఒకరితో పోల్చి చూసే అవకాశం ఇవ్వరు.

చివరి రోజుల్లో దుర్భరమైన జీవితం గడిపిన లెజెండరీ లేడీ కమెడియన్
Advertisement

తాజా వార్తలు