భారత్ ఒలింపిక్ విజేతలకు చైనా కంపెనీ షియోమి బహుమతి..!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా పోటీలు ఒలింపిక్స్ గేమ్స్.మరి అటువంటి వాటిలో పాల్గొనడానికి స్థానం పొందాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

అర్హత సాధించి ఒలింపిక్స్ లో పాల్గొనడం ఒక ఎత్తైతే ఆ ఒలింపిక్స్ లో మెడల్ పొందడం మరో ఎత్తు అవుతుంది.ఒకసారి కనుక మెడల్ సాధించారే అనుకో ఇక వారికి పంట పండినట్లే.

అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు వారికి నజరానాను ప్రకటిస్తాయి.ప్రభుత్వం వారికి ఉద్యోగాన్ని మంజూరు చేస్తుంది.

నగదు బహుమతులు అందుతాయి.తాజాగా ఒలింపిక్స్ లో విజయం సాధించిన వారికి షియోమి ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

Advertisement

గెలుపొందిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.మెడల్స్ సాధించిన వారికి ప్రత్యేక బహుమతులను ఇవ్వనున్నట్టు తెలిపింది.

టోక్యో ఒలింపిక్స్ లో విజయం సాదించిన వారికి స్మార్ట్ ఫోన్లను ఇవ్వనుంది.క్రీడాకారులందరికీ కూడా చైనా దేశానికి చెందిన దిగ్గజ కంపెనీ షియోమి రెడ్ మీ 11 అల్ర్టా స్మార్ట్‌ఫోన్‌ ను బహుమతిగా ఇస్తున్నట్లు తెలియజేసింది.

టీమిండియా పురుషుల హాకీ టీమ్ లో ఉన్న అందరికీ కూడా ఎంఐ 11x స్మార్ట్‌ ఫోన్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.షియోమి Mi 11 అల్ట్రా ఫీచర్లను మనం ఒకసారి చూసినట్లైతే అందులో 12gb ర్యామ్‌ ఉంది.అంతేకాకుండా 256gb స్టోరేజీ కూడా ఉంది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ రేటు ఏకంగా రూ.69,999గా ఉంది.ఎమ్ఐ 11X స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూసినట్లైతే ఇది 6gb ర్యామ్‌ తో ఉంది.

అలాగే 128gb స్టోరేజీ ఇందులో ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ రేటు రూ.29,999గా ఉంది.అదేవిధంగా ఈ మోడల్ లోనే 8gb ర్యామ్‌, 128gb స్టోరేజీ తో కూడిన స్మార్ట్ ఫోన్ రూ.31,999 ధరతో ఉంది.దీనికి సంబంధించిన వివరాలను షియోమి ఎండీ మనుకుమార్ జైన్ ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

ట్వీట్ ద్వారా ఆయన ఈ విషయాలను తెలియజేశాడు.ఒలంపిక్స్‌ లో విజయం సాధించిన నీరజ్‌ చోప్రా, మీరాబాయ్‌ చాను, రవి కుమార్‌ దహియా, లవ్లినా బోర్గోహైన్‌, పీవీ సింధు, భజరింగ్‌ పునియా, పురుషుల హాకీ జట్టుకు కానుకలు ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు