ఆ ఒక్క వీడియో.. వీడిపోయిన అనుమానపు తెరలు: ట్రంప్ ఇరుక్కున్నట్లేనా..?

క్యాపిటల్ భవనంపై మద్ధతుదారులను ఉసిగొల్పారంటూ ట్రంప్‌పై డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ తీర్మానంపై ప్రస్తుతం సెనేట్‌లో విచారణ జరుగుతోంది.

అయితే ట్రంప్‌పై ఏ మూలనో కాస్త జాలి, సానుభూతి వున్న వాళ్లకి డెమొక్రాట్లు సభలో ప్రవేశపెట్టిన ఓ వీడియోతో అనుమానపు తెరలు వీడిపోయాయి.మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహా పలువురు అమెరికా చట్టసభ్యుల పైకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడం, పోలీసులపై దాడికి దిగడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.

పెన్స్‌, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీల కోసం ఆందోళనకారులు ఆగ్రహంతో వెతకడం, పెన్స్‌ సహా ఆయన కుటుంబ సభ్యులను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించడం వంటివి అందులో వున్నాయి.ఈ వీడియో ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియలో తిరుగులేని సాక్ష్యాధారంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెనేటర్ జామీ రస్కిన్‌ సహా పలువురు డెమొక్రాటిక్‌ నేతలు ట్రంప్‌కు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు.

Advertisement

ఆయన ఏమాత్రం అమాయకుడు కాదని.ట్రంప్ తన బాధ్యతలను విస్మరించారని.దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని పరిరక్షిస్తానంటూ చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని రస్కిన్ ఆరోపించారు.

ఆ రోజు ఆందోళనకారులకు ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ చిక్కి ఉంటే, ఆమెను చంపేసి ఉండేవారని మరో డెమొక్రాటిక్‌ నేత ప్లాస్కెట్‌ ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ట్రంప్‌పై అభిశంసన తీర్మానంపై చర్చకు సెనేట్‌లో ఆరుగురు రిపబ్లికన్లు మద్దతు తెలపడం విశేషం.

అటు ఇండో అమెరికన్ నేతలు రాజా కృష్ణమూర్తి, అమీ బెరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌‌లు కూడా విచారణకు అంగీకారం తెలిపారు.కాగా, అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 (బుధవారం)న యూఎస్ కాంగ్రెస్.

క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

Advertisement

వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు